
US Fed Interest Rate: అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నేపథ్యంలో ఎట్టకేలకు కీలక వడ్డీ రేట్లను పెంచింది. 2023 జులై తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆ మధ్యలో 7 సార్లు వడ్డీ రేట్లను తగ్గించింది. ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డాలర్, బాండ్స్ బలపడనున్న క్రమంలో బంగారం ధరలు తగ్గనున్నాయి.




