
ఇంటర్నెట్‌డెస్క్‌: ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వు (US Federal Reserve) కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను (Interest Rates) 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతూ ఏకగ్రీవంగా నిర్ణయించింది. 2023 తర్వాత పెంచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తాజా నిర్ణయంతో వడ్డీ రేటు 3.75 శాతం నుంచి 4 శాతానికి పెరిగినట్లు అయింది. సెంట్రల్ బ్యాంక్ తాజా సమ్మరీ ఆఫ్ ఎకనామిక్ ప్రొజెక్షన్స్ ప్రకారం ఈ ఏడాది ముగిసేలోపు వడ్డీ రేట్లు మరోసారి పెరిగే అవకాశం ఉందని ఫెడ్ అధికారులు సంకేతాలు ఇచ్చారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.