
ఇంటర్నెట్‌ డెస్క్: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి (Stock Market). యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశ ఫలితాలకు ముందు చమురు ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం.. మార్కెట్‌కు కలిసొచ్చింది. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు రాణించడంతో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ ఉదయం 74,249.31 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 74,003.82) లాభాల్లో ప్రారంభమైంది. రోజులో చాలా వరకు లాభాల్లో కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 74,505.86 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 332.63 పాయింట్ల లాభంతో 74,336.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 99 పాయింట్లు పెరిగి 23,217.60 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.95గా ఉంది. సెన్సెక్స్‌ 30లో ఐటీసీ, ఎస్‌బీఐ, యాక్సిస్‌బ్యాంక్‌, ట్రెంట్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బీఈఎల్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌మహీంద్రా, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 107.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్స్‌ ధర 4,342.99 డాలర్ల వద్ద కొనసాగుతోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





