
Helicaptor Crash : లాస్ ఏంజిల్స్ (Los Angeles) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. చాట్స్వర్త్ (Chatsworth) లోని నార్డ్హాఫ్ స్ట్రీట్ (Nordhalf Street) లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లాస్ ఏంజిల్స్ మెట్రో బస్సు (Metro bus), కారు (Car) ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లి లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఓ మీడియా ఛానెల్ హెలికాప్టర్ (Media Helicopter) కుప్పకూలింది. కూలిపోయిన హెలికాప్టర్ ఎన్బీసీ లాస్ ఏంజిల్స్ న్యూస్ ఛానెల్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. రోడ్డు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన హెలికాప్టర్లో నలుగురు మీడియా ప్రతినిధులు ఉన్నారు. హెలికాప్టర్ కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అందులో ఉన్నవారిలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రెండు ప్రమాదాల్లో కలిపి మొత్తం ఆరుగురు మృతిచెందినట్లు అయ్యింది. కాగా, ఈ ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు. లైవ్.. హెలికాప్టర్ క్రాష్ విజువల్స్ యూఎస్ – లాస్ ఏంజిల్స్‌లోని చాట్స్వర్త్లో ఘోర ప్రమాదం రోడ్డు ప్రమాదాన్ని కవర్ చేస్తూ గాలిలోనే కుప్పకూలిన NBC లాస్ ఏంజిల్స్ న్యూస్ ఛానెల్ హెలికాప్టర్ చాట్స్‌వర్త్‌లోని నార్డ్హాఫ్ స్ట్రీట్‌లో LA మెట్రో బస్సును ఢీకొట్టిన SUV.. ఈ ప్రమాదంలో… pic.twitter.com/3gwyq3huI7 — Telugu Scribe (@TeluguScribe) September 16, 2026