
ఇంటర్నెట్ డెస్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో హ్యాట్రిక్ కొట్టి సంబరాలు చేసుకుందామని భావించిన సబలెంకా (aryna sabalenka)కు రిబకినా నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఫైనల్‌లో ఆమెను ఓడించిన రిబకినా (Rybakina) టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. దీంతో సబలెంకా కోపం తారస్థాయికి చేరింది. మ్యాచ్‌ ముగిసిన వెంటనే తన రాకెట్‌ను విరగ్గొట్టేసింది. అంతకుముందు మ్యాచ్‌లోనూ టెన్నిస్ బంతులను ఎలా పడితే అలా కొట్టేసింది. ఈ క్రమంలో ఓ కెమెరామెన్‌కు బంతి తాకే ప్రమాదం కాస్తలో తప్పింది. దీంతో యూఎస్ ఓపెన్ నిర్వాహకులు చర్యలు చేపట్టారు. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు సబలెంకాకు 7500 డాలర్లు (దాదాపు రూ. 7.15 లక్షలు) ఫైన్‌ విధించారు. యూఎస్ ఓపెన్ సెమీఫైనల్స్‌ సమయంలోనే రిబకినా (Rybakina Top Rank) అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఇక ఫైనల్‌లో గెలవడంతో పాయింట్లూ భారీగానే వచ్చాయి. వీరిద్దరి మధ్య వ్యత్యాసం దాదాపు 2100 పాయింట్లకుపైనే ఉంది. తాజాగా అప్‌డేట్‌ చేసిన ర్యాంకుల పట్టికలో.. రిబకినా 9,901 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంది. సబలెంకా 7,875 పాయింట్లతో రెండోస్థానానికి పడిపోయింది. వీరి తర్వాత జెస్సికా పెగులా (7,265), కోకో గాఫ్ (7,244), మిర్రా ఆండ్రీవా (5,743) ఉన్నారు. గాయం కారణంగా యూఎస్ ఓపెన్‌లో యానిక్ సినర్ (Jannik Sinner) పాల్గొనలేదు. అయినా అతడి టాప్ ర్యాంక్‌పై ప్రభావం పడలేదు. ప్రస్తుతం 11,500 పాయింట్లతో సినర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. యూఎస్ ఓపెన్ విజేత అలెగ్జాండర్ జ్వెరెవ్ (9,690) రెండో ర్యాంకులో నిలిచాడు. వీరి తర్వాత కార్లోస్ అల్కరాస్ (5,560), బెన్ షెల్టన్ (4,680), అగర్ (3,890) ఉన్నారు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల విజేత నొవాక్ జకోవిచ్ (2,980) టాప్ -10 నుంచి నిష్క్రమించడం గమనార్హం. ప్రస్తుతం అతడు 11వ స్థానంలో ఉన్నాడు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. సంజు శాంసన్‌ (57; 22 బంతుల్లో 7x4, 4x6) రెచ్చిపోవడంతో అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.