EPF Insurance Cover Increase: కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 16న ఈపీఎఫ్ అకౌంట్కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈపీఎఫ్ కింద వేతన పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు పెంచేందుకు ఆమోదం తెలిపింది. అయితే ఈ మార్పుతో ఈపీఎఫ్, ఈపీఎస్తో పాటుగా ఈడీఎల్ఐ బీమా కవరేజీ కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పీఎఫ్ ఇన్సూరెన్స్ గరిష్ఠ పరిమితి రూ. 7 లక్షలుగా ఉండగా ఇది రూ. 10.50 లక్షలకు చేరొచ్చన్న అంచనాలు ఉన్నాయి.





