
ఇప్పటివరకు సిగరెట్లు, గుట్కా, మద్యం సీసాలపై ముద్రిస్తున్న ‘ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరికల తరహాలోనే దగ్గుమందు సీసాలపైనా ‘నాలుగేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యానికి ప్రమాదకరం’ అంటూ ఎర్ర అక్షరాలతో ముద్రించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని సమాచారం.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

ఇప్పటివరకు సిగరెట్లు, గుట్కా, మద్యం సీసాలపై ముద్రిస్తున్న ‘ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరికల తరహాలోనే దగ్గుమందు సీసాలపైనా ‘నాలుగేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యానికి ప్రమాదకరం’ అంటూ ఎర్ర అక్షరాలతో ముద్రించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని సమాచారం.
నాలుగేళ్లలోపు చిన్నారులకు వాడకుండా చూసేందుకే.. ఈనాడు వాణిజ్య విభాగం: ఇప్పటివరకు సిగరెట్లు, గుట్కా, మద్యం సీసాలపై ముద్రిస్తున్న ‘ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరికల తరహాలోనే దగ్గుమందు సీసాలపైనా ‘నాలుగేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యానికి ప్రమాదకరం’ అంటూ ఎర్ర అక్షరాలతో ముద్రించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని సమాచారం. 2025 అక్టోబరులోనే డైరెక్టరేట్‌ ఆఫ్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) హెచ్చరికలు చేసినా కూడా, చిన్నారులకు దగ్గు మందు వాడకం కొనసాగుతోందని గమనించినందునే.. ఔషధ నియంత్రణ సంస్థ తాజా చర్యలకు ఉపక్రమించనుందని తెలుస్తోంది. వైద్యులు ప్రిస్క్రైబ్‌ చేయకుండానే, ఔషధ దుకాణాల్లో కొనుగోలు చేసి, దగ్గు మందును చిన్నారులకు వాడటమూ మనదేశంలో ఎక్కువే. ఈ నేపథ్యంలోనే పలు చర్యలు తీసుకుంటున్నారు. శిశువులు, తప్పటడుగులు వేసే చిన్నారులకు దగ్గుమందు ఇవ్వడాన్ని నిరుత్సాహపరిచేలా ‘సీసాలపై ఉండే లేబుళ్లలో మార్పులు చేయాలనే’ ప్రతిపాదనను భారత ఔషధ నియంత్రణ సంస్థ పరిశీలిస్తోంది. పాఠశాల వయస్సు పిల్లల చిత్రాన్ని దగ్గుమందు సీసా ప్యాకేజింగ్‌పై ముద్రించడం ద్వారా, అంతకంటే చిన్నపిల్లలకు వాడొద్దనే సందేశాన్ని స్పష్టంగా తెలియజేయాలని భావిస్తోంది. ‘నాలుగేళ్లలోపు చిన్నారులకు వాడొద్దంటూ’ ఎరుపు రంగులో హెచ్చరిక ముద్రించాలన్నదీ ప్రణాళిక. తద్వారా ఈ ఉత్పత్తి పెద్ద పిల్లల కోసం ఉద్దేశించినదని తెలియ చేయొచ్చన్నది యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనను పరిశీలన కోసం డ్రగ్స్‌ కన్సల్టేటివ్‌ కమిటీకి సమర్పించారు. ఇందుకోసం 1945 నాటి డ్రగ్స్‌ రూల్స్‌లోని 96 నిబంధనావళిలో మార్పులు చేయాలని ప్రతిపాదించారు. ప్రిస్క్రిప్షన్‌ మార్గదర్శకాలు ఈ ఏడాది జూన్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఔషధ నిబంధనావళిలో మార్పులు చేసింది. దగ్గుమందుతో పాటు సిరప్‌ రూపంలో ఉండే మందులను ఓవర్‌-ది-కౌంటర్‌ (ఓటీసీ) విభాగం నుంచి తొలగించింది. ఈ మందులను కొనుగోలు చేయాలంటే వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌ తప్పనిసరి అని ప్రకటించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి








