
హెపటైటిస్ ఎ, ఇ సమస్య ఉంటే వికారం, నీరసం, ఎక్కువగా తినాలనిపించకపోవడం, తేలికపాటి జ్వరం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. అందుకే, ఎక్కువ మంది వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే, దీని తీవ్రతని ముందుగా గమనించాలి. ప్రపంచంలోని హెపటైటిస్ ఎ కేసులలో దాదాపు ఐదో వంతు భారతదేశంలోనే ఉన్నాయి. ఈ సమస్య కారణంగా వచ్చే మరణాలు కూడా ఇక్కడే జరుగుతన్నాయి. వర్షాలు పడగానే ప్రతీ సంవత్సరం వచ్చే కాలుష్యానికి సమస్య వస్తుంది. అందుకే, వర్షాల సమయంలో వారం పాటు తగ్గకుండా నీరసం ఉంటే ముందుగా అలర్ట్ అవ్వాలి. హెపటైటిస్‌కి కారణమయ్యే కలుషిత నీరు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, టైఫాయిడ్, కలరా వంటి జీర్ణాశయ సంబంధిత ఇన్ఫెక్షన్స్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కడుపులో అసౌకర్యం, విరోచనాలు , వాంతుల వంటి లక్షణాలను మనం కడుపుకి సంబంధించిన సమస్య అనుకుంటాం. అలాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా టైమ్ వేస్ట్ చేస్తారు. కానీ, ఈ సమస్య గురించి పూర్తి సమాచారం సరైన రోగనిర్ధారణ పరీక్షల ద్వారా గుర్తించొచ్చు. సరైన టైమ్‌కి సమస్యని గుర్తించి ట్రీట్మెంట్ చేస్తే పిల్లలు, పెద్దవారు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి మిగతా సమస్యల ప్రమాదాన్ని తగ్గించొచ్చు. వర్షాకాలం కలుషిత నీటితో పాటు తేమని కూడా తీసుకొస్తుంది. దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. తడిగా ఉండే బట్టలు , చెప్పుల నుంచి వచ్చే తడి, అధిక చెమట నుండి వచ్చే తేమ, చర్మ సమస్యలు, దురద, తామర వంటి ఇన్ఫెక్షన్స్కి దారితీస్తాయి. అలా కాకుండా ఉండేందుకు చర్మాన్ని పొడిగా ఉంచుకుని వ్యక్తిగత పరిశుభ్రతని పాటించి లక్షణాలని ముందుగానే గుర్తిస్తే సమస్య నుంచి బయటపడొచ్చు. కండ్ల కలక, దీనినే ఐ ఫ్లూ అని కూడా అంటారు. వర్షాకాలంలో సైలెంట్‌గా వ్యాపించే మరో ఇన్ఫెక్షన్ ఇది. తేమ, కలుషితమైన వాతావరణం, పాఠశాలలు, ఆఫీస్‌లు, జర్నీల్లో ఈ సమస్య పెరుగుతుంది. కళ్ళు ఎర్రబడటం, కంటి నుంచి నీరు కారడం వంటి వాటిని అలర్జీ, చికాకు అని కొట్టిపారేస్తారు. కానీ, దీనిని ముందుగానే గుర్తించి డాక్టర్ని కలిస్తే సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు. ముఖ్య . కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.





