కాకరకాయ కూరలో మజ్జిగ కలిపి వండితే కూరలోని చేదు తగ్గుతుందని సోషల్ మీడియాలో ఓ చక్కని టిప్‌ని షేర్ చేశారు. దీని వల్ల చాలా వరకూ చేదు బ్యాలెన్స్ అవుతుంది. మనం సాధారణంగా వంటల్లో పెరుగుని కలుపుతుంటాం. దీంతో ఆ వంట రుచి పెరుగుతుంది. గ్రేవీ చిక్కగా వస్తుంది. అలానే కాస్తా పుల్లని మజ్జిగని కలిపి వండడం వల్ల ఆ పులుపు చేదుని బ్యాలెన్స్ అవుతుంది. పుల్లని మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కాకరకాయలోని చేదుని తగ్గించి బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాకుండా కాకరకాయ ముక్కల్లో మజ్జిగ వేస్తే ముక్క నాని త్వరగా ఉడుకుతుంది. కూరలో వేసిన పదార్థాలన్నీ అబ్జార్బ్ చేసుకుంటాయి. దీంతోపాటు కూరకి మంచి రుచి తీసుకొస్తుంది. కాబట్టి, కాకరకాయ కూరలో మజ్జిగని కలపడం అలవాటు చేసుకోండి. కాకరకాయ వండేటప్పుడు మజ్జిగని కలపడం మాత్రమే కాదు. వండే ముందు కాకరకాయ ముక్కల్ని మజ్జిగలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి అందులో ఉంచాలి. సుమారు 20 నుండి 30 నిమిషాల పాటు నానబెడితే చేదు చాలా వరకూ తగ్గుతుంది. ఆ తర్వాత మీరు చక్కగా కూర వండుకోవచ్చు. కూర వండక ముందే ఉప్పు, పసుపు వేసిన మజ్జిగలో కాకరకాయల్ని వేసి ప్యాన్‌లో వేసి ఉడికించాలి. ఆ తర్వాత కూర వండి చూడండి. ఇప్పుడు చెప్పిన 3 పద్ధతులు కూడా కాకరకాయలోని చేదుని తగ్గించి కూరని రుచిగా చేస్తాయి. మీకు ఇందులో ఏది నచ్చితే ఆ పద్ధతిని ఎంచుకోవచ్చు. చక్కగా వండుకోవచ్చు. ఇవే కాకుండా కొంతమంది బెల్లంపొడి, బెల్లం, చక్కెర, నిమ్మరసం, చింతపండు రసం వంటివి వేసి వండుతారు. మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ రకంగా వండుకోవచ్చు. ముఖ్య . కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.