

- ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. పాస్ అయిన వారికి లోకేశ్ విషెస్
- 51శాతం ఇన్-సర్వీస్.. 47శాతం రెగ్యులర్ అభ్యర్థులు పాస్
- ఏపీ టెట్-2026 రిజల్ట్స్ ఔట్.. ఇలా చెక్ చేసుకోండి
AP TET Results 2026 : ఏపీ టెట్ అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET)-జూన్ 2026 ఫలితాలు వచ్చేశాయ్.. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం (సెప్టెంబర్ 13) ఎక్స్ వేదికగా టెట్ రిజల్ట్స్ ప్రకటించారు.
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (AP TET Results 2026)లో తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే .
ఏపీ టెట్లో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం 51 శాతంగా నమోదైంది. రెగ్యులర్ అభ్యర్థుల్లో 47 శాతం మంది అర్హత సాధించారు. టెట్లో విజయం సాధించిన అభ్యర్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఇన్-సర్వీస్ టీచర్లు సాధించిన ఉత్తీర్ణతపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అలానే ముందుకు సాగాలి :
టెట్లో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని సూచించారు. విజయం అనేది ఒక ప్రయాణమన్నారు. వైఫల్యాన్ని అధిగమిస్తూ ముందుకు సాగాలని వారికి సూచించారు.
ఏపీ టెట్ జూన్ 2026 ఫలితాలను అభ్యర్థులు అధికారిక టెట్ ఫలితాల (https://tet2dsc.apcfss.in/) వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఫలితాలను తెలుసుకునేందుకు 9552300009 . టెట్ అభ్యర్థులు తమ వివరాలను ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఏపీ టెట్ ఫలితాల నేపథ్యంలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది.





