
ఆదోని మార్కెట్: విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మురళీకృష్ణ నాయుడు అన్నారు. ఆదివారం శివమూర్తి స్వామి అధ్యక్షతన ఆ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 12 ఏళ్లకే పెన్షన్‌ రీస్టోర్ చేయాలన్నారు. వెంటనే 30 శాతం ఐఆర్ ఇవ్వాలన్నారు. మూడు డీఏలు ఇవ్వాల్సిన చోట, రెండే ప్రకటించడం సరికాదన్నారు. విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య దృష్ట్యా అరియర్స్ వెంటనే చెల్లించేలా చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్‌ రెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అన్వర్, గోవిందరాజు, రఘురామయ్య, ఆంజనేయులు, రాజేశ్వరరావు, రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




