
Vodafone Idea: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియాకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో వీఐ షేరు 100 శాతం పెరిగింది. ఇప్పుడు ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం ఏకంగా రూ. 33,250 కోట్ల మేర లోన్ ఇచ్చేందుకు అంగీకరించడంతో ఇన్వెస్టర్లు ఈ స్టాక్ కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ క్రమంలో వీఐ షేరు ర్యాలీకి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.






