
రాబోయే నెలలు రుణగ్రహీతలకు కష్ట కాలంగా చెప్పాలి..ఎందుకంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్లో రెపో రేటును పెంచడానికి సిద్ధమవుతోంది. అక్టోబర్ సమావేశంలో రెపో రేటును 0.25 శాతం పెంచాలని ఎస్బిఐ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. డిసెంబర్లో కూడా ఇలాంటి పెంపు అవసరం కావచ్చు. ఒకవేళ ఇది జరిగితే, గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతర ఫ్లోటింగ్-రేట్ రుణాలపై వడ్డీ రేట్లు, ఈఎంఐలు పెరిగే అవకాశం ఉంది. అయితే, వడ్డీ రేట్ల పెంపు వల్ల డిపాజిటర్లకు ఒక శుభవార్త అందవచ్చు. రెపో రేటు పెరిగే కొద్దీ, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. దీని అర్థం, ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నవారు లేదా రాబోయే నెలల్లో డిపాజిట్ చేయాలని యోచిస్తున్నవారు గతంలో కంటే మెరుగైన వడ్డీ రేట్లను పొందవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..





