
పెదనందిపాడు: గణపతి నవరాత్రి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులో శ్రీరామ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాన్ని రూ.88,88,888 విలువైన కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వినాయకుడ్ని దర్శించుకుంటున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





