
ప్రిస్క్రిప్షన్‌ ఆడిట్‌ మార్గదర్శకాలు విడుదల చేసిన ఎన్‌హెచ్‌ఎం ఈనాడు, హైదరాబాద్‌: వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులను పరీక్షించాక, రాసే మందుల వివరాలు సమగ్రంగా ఉండాలని జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కొత్త మార్గదర్శకాలతో కూడిన ‘ప్రిస్క్రిప్షన్‌ ఆడిట్‌’ తాజాగా విడుదల చేసింది. వైద్యసేవల్లో నాణ్యత పెంచేందుకు, రోగుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ సూచన మేరకు ఈ మార్గదర్శకాలను సిద్ధం చేసింది. అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. వైద్యులు రాసే మందుల చీటీ తప్పులను గుర్తించి, వాటికి దారితీస్తున్న మూల కారణాలను విశ్లేషించడం, యాంటీబయాటిక్స్, సిరప్‌లు, ఇంజెక్షన్ల అనవసర వాడకాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ మార్గదర్శకాలు రూపొందించారు. కొత్త నిబంధనల ప్రకారం ఫార్మకాలజిస్టులు, క్లినికల్‌ ఫార్మకాలజిస్టులు మరింత పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తారు. ప్రాథమిక, ద్వితీయ శ్రేణి ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులలో ప్రతి నెల లేదా త్రైమాసికానికి ఒకసారి ఈ ఆడిట్‌ నిర్వహించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.