
కొత్తవలస: విశాఖపట్నం-అరకు జాతీయ రహదారిపై కొత్తవలస మండలం నిమ్మలపాలెం గ్రామానికి సమీపంలోని రావి చెరువు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం చెరుకుబిడ్డ గ్రామానికి చెందిన బిడ్డ చరణ్ (21), రాజు (26) ద్విచక్ర వాహనంపై విశాఖపట్నంలో ఉద్యోగ రీత్యా కొత్తవలస వైపు వస్తున్నారు. నిమ్మలపాలెం రావిచెరువుకు సమీపంలో తారు రోడ్డు పక్కన మట్టి రోడ్డులో ఆగిఉన్న బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చరణ్ తలకు, నుదురుకు బలమైన గాయాలై మెదడు బయటకు వచ్చేసింది. రాజు కాలుకు బలమైన గాయమైంది. 108 వాహనంలో వీరిని శృంగవరపుకోట సామాజిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చరణ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాజుకు ప్రథమ చికిత్స చేసి విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




