
రొంపిచర్ల: ద్విచక్ర వాహనాన్ని ట్రావెల్స్‌ బస్సు ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సోమవారం ఉదయం పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం నరసరావుపేటలో జరిగింది. నరసరావుపేట నుంచి రొంపిచర్ల వైపు వెళ్తున్న బైక్‌.. చెక్‌ పోస్టు వద్ద రోడ్డు క్రాస్‌ చేస్తుండగా బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





