
విజయనగరం రూరల్‌: విజయనగరం జిల్లా కేంద్రంలో ఆదివారం వివిధ ప్రాంతాల్లో భారీగా పర్యావరణహిత మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు పంపిణీ చేశారు. బ్యాంకు కాలనీలో బాలాజీ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. గుంకలాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వెలమల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 350 ప్రతిమలు, ఆర్ అండ్ బీ చర్చి రోడ్డులో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగరాజు, వాసు, సునీల్ సుమారు 2500 మట్టి వినాయక బొమ్మలను వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






