
మల్కాపురం: గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యారాడ బీచ్‌లో నిమజ్జనం ఏర్పాట్లు, భద్రతా చర్యలను న్యూపోర్టు పోలీస్ బృందం ఆదివారం పరిశీలించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బీచ్‌ను పరిశీలించి లైఫ్ గార్డులకు పోలీసులు పలు సూచనలు చేశారు. వినాయక నిమజ్జనాల్లో అపశృతి చోటుచేసుకోకుండా చూడాలన్నారు. గాజువాక నుంచి సింధియా వైపుగా ఘాట్‌ రోడ్డులో వినాయక నిమజ్జనానికి ఊరేగింపుగా రానున్నారని, ఆయా మార్గాల్లో అదనపు భద్రతను పర్యవేక్షించనున్నట్లు పోలీసులు తెలిపారు. నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా రెండు రోజుల క్రితం మెరైన్ పోలీసుల బృందం, ఉన్నతస్థాయి అధికారులు యారాడ తీరం పరిసరాల ప్రాంతాలను పరిశీలించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






