
ఆదిలాబాద్ క్రీడా విభాగం: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 18న జడ్పీఎస్ఎస్ ఇచ్చోడలో అండర్-14, 17 ఏళ్ల విభాగం బాలబాలికల హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ మాధవి, సమాఖ్య జిల్లా కార్యదర్శి ఆడే రామేశ్వర్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 9.30 గంటలకు తమ ఆధార్ కార్డ్, బోనాఫైడ్, జనన ధృవీకరణ పత్రాలతో పీఈటీ ఎ.మోహన్ రెడ్డిను సంప్రదించి రిపోర్టు చేయాలని సూచించారు. 14 ఏళ్లలోపు బాలబాలికలు 01-01- 2013 తర్వాత, 17 ఏళ్లలోపు బాల బాలికలకు 01-01-2010 సంవత్సరం తర్వాత పుట్టిన వారై ఉండాలన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





