
ఆదిలాబాద్ క్రీడావిభాగం: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆదివారం అండర్-15 బాల బాలికల జిల్లా స్థాయి చదరంగం ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు ఈనెల 20 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చదరంగం సంఘం అధ్యక్షుడు ఆర్.జనార్దన్ రావు, ప్రధాన కార్యదర్శి ఎన్.స్వామి పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






