సింధూ జలాల
Actor ProfilePolitician

సింధూ జలాల

📊 Box Office Collections
Total News7
Movie Updates0
Sources6
సింధు జలాలపై భారత్ కఠిన వైఖరి.. యుద్ధానికి సిద్ధమంటున్న పాకిస్థాన్ రక్షణ మంత్రి
Andhra Jyothy29 Jun 2026
సింధు జలాలపై భారత్ కఠిన వైఖరి.. యుద్ధానికి సిద్ధమంటున్న పాకిస్థాన్ రక్షణ మంత్రి

సింధు జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గేది లేదని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. సింధు జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గేది లేదని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ చర్యలు తమ నీటి సరఫరాకు ముప్పు కలిగిస్తున్నాయని, అవసరమైతే ఆ దేశంపై యుద్ధానికి వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా హెచ్చరించారు (Indus Waters Treaty). పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదానికి పూర్తిగా, విశ్వసనీయంగా అడ్డుకట్ట వేయకపోతే ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది. కాగా, పాకిస్థాన్‌కు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించే లేదా అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే అది జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని ఆసిఫ్ (Khawaja Asif) అన్నారు. పాక్ ఆర్థిక వ్యవస్థ, కోట్లాది మంది ప్రజల జీవనాధారం సింధు నదీ వ్యవస్థపై ఆధారపడి ఉందని ఆసిఫ్ అన్నారు. ఈ నేపథ్యంలో నీటి హక్కులను కాపాడుకునేందుకు అన్ని మార్గాలనూ ఉపయోగిస్తామని, అవసరమైతే యుద్ధం వరకు వెళ్లడానికి కూడా వెనుకాడబోమని ఆసిఫ్ హెచ్చరించారు. సింధు జలాల ఒప్పందం 1960లో కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ వ్యవస్థలోని ఆరు నదులను భారత్, పాకిస్థాన్‌కు సమానంగా కేటాయించారు (India Pakistan Water Dispute). ఈ ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు హక్కులుంటాయి. సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్థాన్‌కు హక్కులుంటాయి. అలాగే పాకిస్థాన్‌కు కేటాయించిన మూడు నదులపై కూడా భారత్‌కు కొన్ని పరిమిత హక్కులు ఉన్నాయి. పాక్‌కు కేటాయించిన నదులపై భారత్ జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు. తాగునీరు, గృహ అవసరాలకు నీటిని వినియోగించుకోవచ్చు. అలాగే పరిమిత స్థాయిలో సాగునీటికి కూడా ఉపయోగించుకోవచ్చు

మళ్లీ కవ్వింపులకు దిగుతున్న పాక్.. భారత్ తో యుద్దానికైనా సై అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
TeluguOne28 Jun 2026
మళ్లీ కవ్వింపులకు దిగుతున్న పాక్.. భారత్ తో యుద్దానికైనా సై అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

దేశంలో అంతర్గత కలహాలు, ఆర్థిక సంక్షోభం పీక్స్ కు చేరడంతో పాకిస్థాన్ దిక్కు తోచని పరిస్థితిలో పడింది. ఈ సమస్యల నుంచి, సంక్షోభాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి

భారత్ తో యుద్ధానికైనా సిద్ధం.. పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక, ముదురుతోన్న సింధూ జలాల వివాదం
Samayam Telugu28 Jun 2026
భారత్ తో యుద్ధానికైనా సిద్ధం.. పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక, ముదురుతోన్న సింధూ జలాల వివాదం

భారత్ - పాక్ మధ్య మళ్లీ హీట్ మూమెంట్ మొదలైంది. పహల్గాం అటాక్ తర్వాత సింధూ జలాల వివాదం తెరపైకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తాజా వ్యాఖ్యలు తీవ్ర

భారత్ అంతు చూడటం మాత్రం గ్యారంటీ
Oneindia Telugu28 Jun 2026
భారత్ అంతు చూడటం మాత్రం గ్యారంటీ

భారత్, పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తమ దేశ నీటి భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్‌తో యుద్ధానికి కూడా వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు

పాక్ పరిస్థితిపై భారత్ చురకలు
Eenadu19 Jun 2026
పాక్ పరిస్థితిపై భారత్ చురకలు

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయ వేదికగా భారత్‌ను నిందించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌ మరోసారి భంగపడింది. ఐక్యరాజ్య సమితి సమావేశంలో జమ్మూకశ్మీర్‌పై ప్రేలాపనలు చేసిన దాయాదికి మన దేశం గట్టిగా బుద్ధి

సింధూ జలాలపై భారత్ కీలక ప్రకటన
Vaartha19 Jun 2026
సింధూ జలాలపై భారత్ కీలక ప్రకటన

Indus Water : సింధూ నదీ జలాల పంపిణీ విషయంలో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారానికి ఐక్యరాజ్యసమితి (UN) సాక్షిగా భారతదేశం అత్యంత ఘాటుగా సమాధానమిచ్చింది. జెనీవాలో జరుగుతున్న యూఎన్‌హెచ్ఆర్‌సీ (UNHRC) 62వ సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి అనుపమ సింగ్ ఈ ఉదంతంపై దేశ వైఖరిని స్పష్టం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందానికి (Indus Water Treaty) పూర్తిగా కాలం చెల్లిందని, ఆనాటి నిబంధనలు నేటి మారుతున్న భౌగోళిక, పర్యావరణ పరిస్థితులకు ఏమాత్రం సరిపోవని ఆమె తేల్చి చెప్పారు. దశాబ్దాల క్రితంనాటి పాత చట్టాలను పట్టుకుని వేలాడటం వదిలేసి, ప్రస్తుత వాస్తవ పరిస్థితులను గ్రహించాలని పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ప్రతినిధుల ముందే గట్టిగా చురకలంటించారు. Read Also : ఇండియా లో తీవ్ర కరవు ఏర్పడబోతుందా..? ఆందోళన కలిగిస్తున్న IMD నిపుణుల హెచ్చరిక పాకిస్తాన్ ప్రభుత్వం ఒకవైపు భారత్‌పైకి సరిహద్దుల గుండా ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రోత్సహిస్తూ, మరోవైపు అంతర్జాతీయ ఒప్పందాల పేరిట భారత్ నుండి స్నేహాన్ని, సద్భావనను ఆశించడం ముమ్మాటికీ అసాధ్యమని అనుపమ సింగ్ స్పష్టం చేశారు. “రక్తపాతం, ఉగ్రవాద చర్యలకు పాల్పడే ఏ దేశమైనా పొరుగు దేశం నుండి సద్భావన వల్ల కలిగే ప్రయోజనాలను ఆశించలేదు” అంటూ భారత్ తరఫున ఒక బలమైన సందేశాన్ని పాక్‌కు పంపారు. కశ్మీర్ అంశాన్ని లేదా జలాల వివాదాన్ని అనవసరంగా అంతర్జాతీయ వేదికలపైకి తెచ్చి నాటకాలు ఆడటం మానేసి, మొదట పాకిస్తాన్ తన దేశంలో ఉన్న అంతర్గత సంక్షోభాలు మరియు సొంత వ్యవహారాలను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని వీడనంత కాలం భారత్ నుండి ఎటువంటి రాయితీలు ఉండబోవనే సంకేతాన్ని ఈ వ్యాఖ్యల ద్వారా భారత్ మరోసారి ప్రపంచానికి స్పష్టం చేసింది. Telangana Rain Update: మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార

సింధూ జలాల ఒప్పందానికి కాలం చెల్లింది
Eenadu19 Jun 2026
సింధూ జలాల ఒప్పందానికి కాలం చెల్లింది

ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశం.. స్నేహంపై ఆధారపడిన హక్కులను ఆశించలేదని భారత్‌ నొక్కి చెప్పింది. సింధూ జలాల ఒప్పందంపై పాక్‌ చేస్తున్న వ్యాఖ్యలను ఐరాసలో భారత్‌ ప్రతినిధి అనుపమ సింగ్‌ తూర్పారబట్టారు