
ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశం.. స్నేహంపై ఆధారపడిన హక్కులను ఆశించలేదని భారత్ నొక్కి చెప్పింది. సింధూ జలాల ఒప్పందంపై పాక్ చేస్తున్న వ్యాఖ్యలను ఐరాసలో భారత్ ప్రతినిధి అనుపమ సింగ్ తూర్పారబట్టారు.
ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి 62వ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సింధూ జలాల ఒప్పందానికి కాలం చెల్లిందని అన్నారు. ఈ ఒప్పందంపై భారత్ తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. సింధూ జలాల ఒప్పందానికి కాలం చెల్లింది: భారత్ |