తల్లికి వందనం’
Actor ProfilePolitician

తల్లికి వందనం’

Total News6
Movie Updates0
Sources4
తల్లికి వందనం' పథకంపై కీలక అప్డేట్
Vaartha16 Jun 2026
తల్లికి వందనం' పథకంపై కీలక అప్డేట్

Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam 2026) పథకం అమలుపై సరికొత్త కీలక అప్‌డేట్ వచ్చింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్

పీఈసెట్ ఫలితాలు విడుదల చేసిన నారా లోకేశ్
Vaartha16 Jun 2026
పీఈసెట్ ఫలితాలు విడుదల చేసిన నారా లోకేశ్

AP PECET 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PECET-2026) ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఫలితాలను ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్

అనితపై వ్యాఖ్యలు.. గుడివాడ అమర్ నాథ్ పై మహిళా కమిషన్ ఆగ్రహం
Vaartha16 Jun 2026
అనితపై వ్యాఖ్యలు.. గుడివాడ అమర్ నాథ్ పై మహిళా కమిషన్ ఆగ్రహం

Rayapati Shailaja: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు

జులై మూడో వారంలో తల్లికి వందనం
Andhra Jyothy16 Jun 2026
జులై మూడో వారంలో తల్లికి వందనం

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే ‘తల్లికి వందనం’ పథకాన్ని త్వరగా అమలు చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్

తల్లికి వందనం’పై గుడ్ న్యూస్ .. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
NTV Telugu16 Jun 2026
తల్లికి వందనం’పై గుడ్ న్యూస్ .. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు

Thalliki Vandanam Scheme: తల్లికి వందనంపై శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఆర్థిక సాయాన్ని జులై మూడో వారంలో అందించేలా అన్ని చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించిన తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ తదితర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు సమర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికల పరిస్థితిపై మంత్రి లోకేష్‌ ప్రత్యేకంగా ఆరా తీశారు. విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను వేగవంతం చేసి అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో భాగంగా జూన్ 29న ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమం నిర్వహించాలని, జులై మూడో వారంలో రాష్ట్రవ్యాప్తంగా ‘మెగా పీటీఎం’ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. విద్యా రంగంలో నాణ్యత పెంపుతో పాటు విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి లోకేష్ అధికారులకు సూచించారు. ‘తల్లికి వందనం’ పథకం అమలు ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు విద్యాభ్యాసాన్ని మరింత ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సమావేశంలో పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్‌

తల్లికి వందనం.. మీకు డబ్బులు పడతాయో లేదో ఇలా తెలుసుకోండి.. సింపుల్ ప్రాసెస్
10TV Telugu2 Jun 2026
తల్లికి వందనం.. మీకు డబ్బులు పడతాయో లేదో ఇలా తెలుసుకోండి.. సింపుల్ ప్రాసెస్

Talliki Vandanam: ఏపీలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో తల్లికి వందనం ఒకటి. ఈ పథకం ప్రతి ఏటా రూ.15 వేలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇందులో రూ.13 వేలు విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన రూ.2 వేలు సూళ్ల నిర్వహణ కోసం వినియోగిస్తారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ సాయం అందజేస్తుంది. మరి తల్లికి వందనం స్కీమ్ వర్తిస్తుందో లేదో, అర్హులో కాదో తెలుసుకోవడం ఎలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దానికి ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది. bm-sgsw.ap.gov.in/ సైట్‌లోకి వెళ్లాలి. అందులో స్కీమ్ ఎలిజిబిలిటీపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. స్కీమ్ టైప్‌లో తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఇయర్ లో ఇయర్ ఎంటర్ చేసి గెట్ డీటైల్స్‌పై క్లిక్ చేయాలి. వెంటనే ఆధార్ లింకైన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే లబ్ధిదారు సమాచారం కనిపిస్తుంది. అందులో ఏమైనా తప్పులుంటే సచివాలయాల్లో సంప్రదించాలి. ఇక, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.9,668 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. గతేడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్‌ 12నే అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసింది సర్కార్. ఈ ఏడాది కూడా అదే తేదీన నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒకటవ తరగతి నుంచి ఇంటర్‌ చదివే విద్యార్థుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా పథకం వర్తించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తుండగా.. ఇందులో తల్లుల ఖాతాలో రూ.13 వేలు జమ చేస్తున్నారు. మిగతా రూ.2 వేలు పాఠశాల నిర్వహణ నిమిత్తం వాడుతున్నారు. తల్లికి వందనం స్కీమ్ లబ్ధి పొందాలంటే తల్లుల బ్యాంకు ఖాతా, మొబైల్ కి ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి. కుటుంబ సభ్యుల మ్యాపింగ్‌ కూడా కీలకమే. అర్హులైన వారు బ్యాంకుకి వెళ్లి ఖాతా స్టేటస్ ను చెక్ చేసుకోవాలి. ఆధార్, బ్యాంకు ఖాతా, మొబైల్ నెంబర్ ఒకదానితో ఒకటి లింకై ఉండాలి. Also Read: మీ జాబ్ మానేశారా? EPFO పోర్టల్‌లో మీ ఎగ్జిట్ తేదీని అర్జెంట్‌గా అప్‌డేట్ చేయండి!