
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే ‘తల్లికి వందనం’ పథకాన్ని త్వరగా అమలు చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. అమరావతి, జూన్ 16: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే ‘తల్లికి వందనం’ పథకాన్ని త్వరగా అమలు చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.
మంగళవారం అమరావతిలో విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అమలుపై వారితో ప్రధానంగా చర్చించారు. విద్యార్థుల తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని .. జులై మూడో వారంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి లోకేశ్‌కు అధికారులు వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు జూన్ 29వ తేదీన షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, జులై మూడో వారంలో మెగా పీటీఎం నిర్వహించాలని ఈ సమీక్ష సమావేశంలో మంత్రి లోకేశ్ నిర్ణయించారు.
అలాగే రాష్ట్రంలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్ష(సెట్)ల నిర్వహణ సకాలంలో నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. త్వరిత గతిన నోటిఫికేషన్లు విడుదల చేసి, నిర్ణీత గడువులోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
జాతీయ స్థాయి పరీక్షలు, పొరుగు రాష్ట్రాల ప్రవేశ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని ఏపీలో ప్రవేశ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులకు మంత్రి లోకేశ్ సూచించారు. బీజేపీ తొత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం: టీపీసీసీ చీఫ్ ఇంటి నుంచే యూరియా బుకింగ్ చేసుకునే సౌకర్యం: మంత్రి తుమ్మల