తమిళ నటుడు
Actor ProfileActor

తమిళ నటుడు

📊 Box Office Collections
Total News6
Movie Updates0
Sources4
తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
Eenadu31 Jul 2026
తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత

ఇంటర్నెట్‌ డెస్క్: చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్‌ (73) కన్నుమూశారు. గుండెపోటుతో ఈ రోజు ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 75 సినిమాల్లో నటించిన భాగ్యరాజ్‌ (K Bhagyaraj), 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. కె.భాగ్యరాజ్‌ పూర్తిపేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో తమిళనాడులో జన్మించిన ఆయన దర్శకులు జి.రామకృష్ణన్, భారతీరాజాలకు అసిస్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. భారతీరాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. 1979లో ‘సువరిల్లద చిత్తిరంగల్‌’ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. నటి ఊర్వశి, ఆమె సోదరి కల్పనలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తమిళ సినిమా ‘16 వెయతినిలె (తెలుగులో పదహారేళ్ల వయసు)’లో తొలిసారి వెండితెరపై కనిపించిన ఆయన.. ఎన్నో చిత్రాలతో అలరించారు. భాగ్యరాజ్ కేవలం నటుడు, దర్శకుడిగానే గాక, కథా రచయితగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటారు. 1983లో వచ్చిన ఐకానిక్ చిత్రం ‘ముందనై ముడిచ్చు’ (తెలుగులో ‘మూడు ముళ్లు’) చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2014లో సైమా (SIIMA) జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన కథలు హిందీ, తెలుగు వంటి ఇతర భాషల్లో రీమేక్ అయి ఘనవిజయం సాధించాయి. అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఆఖరి రాస్తా’, అనిల్ కపూర్ నటించిన ‘వో 7 దిన్’ చిత్రాలకు ఆయనే కథ అందించారు. ఇటీవలే తెలుగులో వచ్చిన ‘35 చిన్న కథ కాదు’, ‘కుబేర’ వంటి చిత్రాల్లో కూడా ఆయన కీలక పాత్రలు పోషించారు. స్క్రీన్‌ప్లే మాంత్రికుడిగా పేరుగాంచిన భాగ్యరాజ్ మృతి తమిళ చిత్రసీమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ

శబరిమల యాత్ర పూర్తి.. సినిమాలపై దృష్టి పెడతా
AP7AM17 Jul 2026
శబరిమల యాత్ర పూర్తి.. సినిమాలపై దృష్టి పెడతా

ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత రవి మోహన్ (జయం రవి) తన శబరిమల యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మే నెలలో చేపట్టిన అయ్యప్ప దీక్షను జూన్ 24న విరమించారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ముగిసిన అనంతరం, ఇకపై

పని మనుషులను ఇంట్లో బంధించిన నటుడు రవి మోహన్
Eenadu11 Jul 2026
పని మనుషులను ఇంట్లో బంధించిన నటుడు రవి మోహన్

చెన్నై (ప్యారిస్‌): చోరీకి పాల్పడ్డారని తన ఇంట్లో పనిచేసే ఇద్దరు మహిళలు, ఓ బాలుడిని ప్రముఖ తమిళ నటుడు రవిమోహన్‌ బంధించినట్లు సమాచారం. చెన్నై నీలాంగరైలో నటుడు రవి మోహన్‌ నివాసం ఉంది. ఇంట్లో నగలు

తమిళ పొలిటికల్ థ్రిల్లర్ లో సునీల్.. అనంతన్ కాడు’ నుంచి ఫస్ట్ లుక్
AP7AM16 Jun 2026
తమిళ పొలిటికల్ థ్రిల్లర్ లో సునీల్.. అనంతన్ కాడు’ నుంచి ఫస్ట్ లుక్

తమిళ నటుడు ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘అనంతన్ కాడు’ నుంచి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు నటుడు సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర

ఫ్యామిలీతో సింగపూర్ వెకేషన్ లో విష్ణు విశాల్, జ్వాలా గుత్తా.. క్యూట్ పిక్స్ వైరల్
10TV Telugu2 Jun 2026
ఫ్యామిలీతో సింగపూర్ వెకేషన్ లో విష్ణు విశాల్, జ్వాలా గుత్తా.. క్యూట్ పిక్స్ వైరల్

తమిళ నటుడు విష్ణు విశాల్(Vishnu Vishal) తన భార్య, బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా, కుమార్తె మీరాతో కలిసి సింగపూర్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. పాపకు ఇది మొదటి అంతర్జాతీయ

హీరో అజిత్ ఇంట్లో విషాదం.. సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్
Samayam Telugu31 May 2026
హీరో అజిత్ ఇంట్లో విషాదం.. సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్

తమిళ నటుడు , హీరో అజిత్ కుమార్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హీరో అజిత్ తల్లి మోహిని మణి శనివారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. అజిత్ కుటుంబానికి