
‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తామని తాను ఇచ్చిన మాటను నటుడు విజయ్ దేవరకొండ నిలబెట్టుకున్నారు. ఈ మేరకు తన సతీమణి రష్మికతో కలిసి అచ్చంపేటకు వచ్చిన విజయ్..2026 విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రష్మిక మాట్లాడారు. ‘‘జీవితంలో గెలుపు ఓటములు సహజం. కానీ, వాటి నుంచి నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు. చదువులో రాణించి మీ తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలి. ఒక లక్ష్యంతో ముందుకు సాగాలి. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలి’’ అని విద్యార్థులకు సూచించారు రష్మిక. ఈ వార్త చదివారా: ‘కాక్‌టెయిల్ 2’ ప్రచారంలో తొక్కిసలాట.. కృతి వ్యవహరించిన తీరుపై నెటిజన్ల ప్రశంసలు








