
అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన టెస్టును టీమిండియా మూడు రోజుల్లోనే ముగించింది. ఒక ఇన్నింగ్స్
Jun 8 2026 3:35 PM | Updated on Jun 8 2026 3:51 PM
అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముల్లన్పూర్ వేదికగా జరిగిన టెస్టును టీమిండియా మూడు రోజుల్లోనే ముగించింది. ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన టీమిండియా భారీ స్కోరు చేయడమే గాక అఫ్గానిస్తాన్‌ను రెండుసార్లు ఆలౌట్ చేసింది.
అయితే ఆఫ్గన్‌పై భారీ విజయం సాధించినప్పటికీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిఫ్ (డబ్ల్యూటీసీ) పట్టికలో భారత్ స్థానం మాత్రం మారకపోవచ్చు. ప్రస్తుతం గిల్ సేన 48.15 పర్సంటేజ్ పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. మరి ఆఫ్గన్‌పై టెస్టు విజయం సాధించినా డబ్ల్యూటీసీ పట్టికలో టీమిండియా స్థానం మారకపోవడానికి కారణమేంటనేది తెలుసుకుందాం.
అఫ్గానిస్తాన్‌తో టెస్టు మ్యాచ్ డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్ సైకిల్లో లేదు. అందుకే ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించినా ఎలాంటి పాయింట్లు రావు. అందుకే డబ్ల్యూటీసీ పట్టికలో టీమిండియా స్థానం మారదు. 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 9 టెస్టుల్లో నాలుగింట గెలిచింది. భారత్ తన డబ్ల్యూటీసీ సైకిల్‌ను ఇంగ్లండ్ టూర్‌తో మొదలుపెట్టింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను డ్రా చేసుకున్న టీమిండియా సౌతాఫ్రికా చేతిలో మాత్రం క్లీన్‌స్వీప్‌కు గురైంది.
అయితే వెస్టిండీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా డబ్ల్యూటీసీ పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (8 టెస్టుల్లో 7 విజయాలు) 87.50 పర్సంటైల్‌తో తొలి స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా (75 పర్సంటైల్‌తో) రెండో స్థానంలో, శ్రీలంక (66.67 పర్సంటైల్‌తో) మూడో స్థానంలో కొనసాగుతోంది.
న్యూజిలాండ్ (58.33), బంగ్లాదేశ్ (58.33) పర్సంటైల్‌తో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇంగ్లండ్ (37.88) ఏడో స్థానంలో ఉండగా.. పాకిస్తాన్ (8.33), వెస్టిండీస్ (4.13) పర్సంటైల్ పాయింట్లతో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.
చదవండి: ‘నన్ను రిటైర్ అవ్వమంటున్నారా?’.. భారత కెప్టెన్ అసహనం!
బ్లాక్ డ్రెస్‌లో ప్రియాంక మోహన్ స్టన్నింగ్ స్టిల్స్
టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు
క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?
హైదరాబాద్: మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా..
కదం తొక్కిన కాక్రోచ్.. జంతర్ మంతర్ వద్ద ధర్నా (చిత్రాలు)
విజయ్ కి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం!
నందు దంపతులకు జైలు శిక్ష? న్యాయవాది సంచలన కామెంట్స్
బస్సును చీల్చుకెళ్లిన లారీ ముగ్గురు ఏపీ వాసుల మృతి..
చంద్రబాబు గుట్టు రట్టు.. రైతులకు టోకరా పెట్టి నారా బ్రాహ్మణి పేరుతో భూములు
మృగశిర కార్తె స్పెషల్.. కిక్కిరిసిన చేపల మార్కెట్లు