
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చలామణీలో ఉన్న పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీని ఆర్‌బీఐ తీసుకురాబోతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది (Fact check). ఈ ఏడాది జూన్ 30 నుంచే ఈ...


ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చలామణీలో ఉన్న పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీని ఆర్‌బీఐ తీసుకురాబోతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది (Fact check). ఈ ఏడాది జూన్ 30 నుంచే ఈ...

భారత్‌లో క్రెడిట్ కార్డులు ఉపయోగించేవారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అలాగని, అందరికీ క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి బ్యాంకులు అంగీకరించవు. మీకు క్రెడిట్ స్కోరు లేకపోవచ్చు/తక్కువ ఉండొచ్చు,...

Netanyahu- Bibi | ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో దౌత్యపరమైన శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఓ వైపు అమెరికా ప్రయత్నాలు చేస్తున్న వేళ.. లెబనాన్, బీరుట్‌లపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడడం అగ్రరాజ్యానికి...

ఇంటర్నెట్‌డెస్క్: దేశంలో ఈకామర్స్ సంస్థలు అనుసరిస్తున్న డార్క్ ప్యాటర్న్స్ (Dark patterns) వల్ల చేతిచమురు వదులుతోంది. అలా వినియోగదారులపై ఏటా రూ.28వేల కోట్లవరకు వాతపడుతోంది. ఈ మేరకు ‘డార్క్...

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆఖరిలో పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్షియల్, ఆటో స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించడం సూచీలకు కలిసొచ్చింది. మరోవైపు ఇరాన్-...

Apple iOS 27 | ఇంటర్నెట్ డెస్క్: టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఓఎస్ అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. ప్రస్తుతమున్న ఓఎస్‌లో పలు మార్పులు చేయడంతో పాటు అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ ఐఓఎస్ 27ను...

Hardeep Singh Puri | ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఇంధన నిల్వలకు ఢోకా లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి వెల్లడించారు. హర్మూజ్ జలసంధి మరోనెల రోజుల పాటు మూతపడి ఇంధన సరఫరాకు అవరోధం...

భారత క్విక్ కామర్స్ స్టార్టప్ రంగంలో సరికొత్త సంచలనం నమోదైంది. ప్రముఖ డెలివరీ సంస్థ Zepto ఐపీఓ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావడానికి అడుగులు పడ్డాయి. వచ్చే వారం ప్రారంభంలోనే మార్కెట్ నియంత్రణ...

ఇంటర్నెట్‌డెస్క్: దేశీయ మార్కెట్లను యుద్ధభయాలు కమ్మాయి. దాంతో సోమవారం సూచీలు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). సెన్సెక్స్ 800 పాయింట్ల మేర కుంగింది. ఉదయం 9.33 గంటల సమయంలో...

Union Commerce and Industry Minister Piyush Goyal Sunday said the government was focused on securing the "best deal" for India in trade negotiations with the United States, adding that he "does not...

Viral post | ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఐటీ ఉద్యోగం అంటేనే రూ.లక్షల్లో జీతం.. విలాసవంతమైన జీవితం.. వారాంతాల్లో పార్టీలు.. సాధారణంగా ఇవే గుర్తొస్తాయి. కానీ, ఇదంతా నాణేనికి ఒకవైపే. ఎంత జీతం వచ్చినా...

TVS Maxi scooter | ఇంటర్నెట్ డెస్క్: స్కూటర్.. అంటే ఒకప్పుడు ఫ్యామిలీ టూవీలర్ మాత్రమే. ఇటీవల కాలంలో వీటి రూపు మారుతోంది. సామర్థ్యమూ పెరుగుతోంది. కుర్రకారును ఆకట్టుకోవడానికి కంపెనీలు స్టైలిష్...

వెండి ఆభరణాలకూ తప్పనిసరి హాల్‌మార్కింగ్ అమలు చేసేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు దేశీయంగా ఉన్నాయా.. నిబంధనావళి ఎలా ఉండాలి.. అనే అంశాన్ని భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) పరిశీలిస్తోంది. 2005 నుంచే...

ఇంటర్నెట్ డెస్క్: అన్ని కంపెనీల వంట నూనెల ప్యాక్ పరిమాణాలు ఒకే విధంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రామాణిక ప్యాక్ పరిమాణాలను నిర్దేశించింది.

ఆధునిక ఆర్థిక రంగంలో సాంకేతిక పురోగతి తీసుకువచ్చిన ప్రయోజనాలలో క్రెడిట్ కార్డు ఒకటి. ఒక సాధారణ స్వైప్ లేదా కొన్ని క్లిక్‌లతో, మీ కొనుగోళ్లకు నగదు చెల్లించే బదులుగా క్రెడిట్ కార్డును ఉపయోగించవచ్చు.

ఇంటర్నెట్‌డెస్క్: ఈ నెలలో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. హ్యుందాయ్ (Hyundai), మారుతి సుజుకీ, టాటా మోటార్స్ వంటి ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి.

CMR Green IPO | దిల్లీ: నాన్-ఫెర్రస్ లోహాల రీసైక్లర్ అయిన సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ ఐపీఓకు (CMR Green IPO) ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. శుక్రవారంతో సబ్‌స్క్రిప్షన్ గడువు...

దిల్లీ: భారత్- అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పంద అంశాలను ఖరారు చేసేందుకు ఇరుదేశాల అధికారులు నాలుగు రోజులుగా నిర్వహించిన చర్చలు నేటితో ముగిశాయి. వస్తు వాణిజ్యం, నాన్- టారిఫ్ చర్యలు, కస్టమ్స్, వాణిజ్య సరళీకరణ తదితర అంశాలపై నిర్మాణాత్మక, సానుకూల చర్చలు జరిగాయని వాణిజ్యశాఖ తెలిపింది. వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసే పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇరుపక్షాలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయని ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఫిబ్రవరిలో ఇరు దేశాలు ఈ ఒప్పందానికి సంబంధించిన ముసాయిదాను ప్రకటించగా.. అందులో ఏయే అంశాలు ఉండాలనే దానిపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన ఈ చర్చల్లో అమెరికా బృందానికి బ్రెండాన్ లించ్ నాయకత్వం వహించగా.. భారత్ తరఫున వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ నేతృత్వం వహించారు. తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)లో చాలా వరకు అంశాలను ఇరుదేశాలు ఖరారు చేసుకున్నాయని వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ ఇటీవల తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

BharatPe Flex | ఇంటర్నెట్ డెస్క్: మనలో చాలా మంది తమ రోజువారీ అవసరాల కోసం క్రెడిట్‌కార్డుపై ఆధారపడుతుంటారు. ఒకేసారి బిల్లు మొత్తం చెల్లిస్తుంటారు. అయితే, క్రెడిట్‌కార్డు అన్నిచోట్లా వినియోగించడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో యూపీఐ చెల్లింపులకూ క్రెడిట్ కార్డు తరహా సదుపాయం ఉంటే బాగుండు అనిపిస్తుంది. సరిగ్గా ఈ కాన్సెప్టుతో యెస్‌బ్యాంక్‌తో కలిసి భారత్‌పే.. ‘భారత్‌పే ఫ్లెక్స్’ పేరిట క్రెడిట్-ఆన్-యూపీఐ సదుపాయాన్ని తీసుకొచ్చింది. యూపీఐ క్రెడిట్‌లైన్ తరహాలోనే ఇదీ పనిచేస్తుంది. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా ఈ సదుపాయం ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. అలా వినియోగించిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి 45 రోజుల వరకు గడువు లభిస్తుంది. ఆ సమయంలో వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ బిల్లు పేమెంట్ చేసేందుకు నగదు అందుబాటులో లేని సందర్భంలో 3 నుంచి 12 ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్, దుకాణాలు వద్ద క్యూఆర్ కోడ్‌లు, యాప్స్ ద్వారా బిల్లు చెల్లింపులు, రీఛార్జులు వంటి అవసరాలకు ఈ క్రెడిట్ ఆన్ యూపీఐ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. భారత్‌పే యూపీఐ యాప్ ద్వారా చేసే లావాదేవీలపై ‘జిలియన్ కాయిన్స్’ రూపంలో రివార్డులు కూడా లభిస్తాయి. వీటిని వోచర్లు కొనడానికి లేదా బిల్లుల చెల్లింపులకు వినియోగించుకోవచ్చు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు




Fake Call Detection | ఇంటర్నెట్ డెస్క్: సైబర్ నేరగాళ్లు ఏఐ టూల్స్ సాయంతో అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. ఫోన్ నంబరు స్పూఫింగ్, ఏఐ వాయిస్ క్లోనింగ్‌తో తెలిసిన వారిలా కాల్స్ చేసి సున్నిత సమాచారాన్ని పట్టేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు గూగుల్ సిద్ధమైంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఫేక్ కాల్ డిటెక్షన్ సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా అవతలి వ్యక్తి చేసిన కాల్ సంబంధిత డివైజ్ నుంచి వచ్చిందో లేదో ఈ ఫీచర్ ఇట్టే పసిగడుతుంది. సైబర్ నేరగాళ్లు సాఫ్ట్‌వేర్‌ల సాయంతో ఫోన్ నంబర్లను స్పూఫ్ చేస్తుంటారు. ఆపై వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ సాయంతో మోసాలకు పాల్పడుతుంటారు. చాలా మంది తమకు వచ్చిన నంబర్, వాయిస్ తమ వారిదేనని మోసపోతుంటారు. గూగుల్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ ఆ కాల్ సంబంధిత ఫోన్ నుంచే వచ్చిందా అనేది ధ్రువీకరిస్తుంది. కాల్ మాట్లాడుతున్న ఇద్దరూ గూగుల్ ఫోన్ యాప్ వాడుతుంటే ఈ ఫీచర్ పనిచేస్తుంది. అవతలి వ్యక్తి నుంచి కాల్ వచ్చినప్పుడు రెండు డివైజ్‌ల మధ్య ఒక డిజిటల్ హ్యాండ్‌షేక్‌లాంటిది ఆటోమేటిక్‌గా కమ్యూనికేట్ అవుతుంది. అంటే తెరవెనుక వెరిఫకేషన్ జరుగుతుంది. ఒకవేళ అవతలి వ్యక్తి కాల్ స్పూఫింగ్ చేస్తున్నట్లయితే సిగ్నల్ మ్యాచ్ కాక వెంటనే యూజర్‌ను అప్రమత్తం చేస్తుంది. ఈ ఫీచర్ పనిచేయాలంటే రెండు ఫోన్లలో తప్పనిసరిగా గూగుల్ ఫోన్ యాప్ డీఫాల్ట్‌గా ఉండాలి. ఇప్పుడు చాలా ఫోన్లలో గూగుల్ ఫోన్ యాప్ డిఫాల్ట్‌గా వస్తోంది. దీనివల్ల వ్యక్తిగత డేటాకు ఎటువంటి ప్రమాదమూ ఉండదు. ఆండ్రాయిడ్ 12 ఆపై వెర్షన్‌లకు ఈ నెల నుంచే ఈ ఫీచర్‌ను గూగుల్ అందుబాటులోకి తేనుంది. తొలుత గూగుల్ పిక్సల్ ఫోన్‌కు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఆపై దశలవారీగా అన్ని ఫోన్లలోనూ ఈ ఫీచర్ పనిచేస్తుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Fact check | ఇంటర్నెట్ డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పెద్దఎత్తున బంగారం విక్రయించినట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఫారెక్స్ నిల్వలు కాపాడుకోవడానికి ఆర్‌బీఐ పసిడిని విక్రయించిందంటూ వచ్చిన బ్లూమ్‌బర్గ్ కథనాన్ని తోసిపుచ్చింది. పసిడి విక్రయం గురించి వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమని పేర్కొంది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల మన ఇంధన దిగుమతుల బిల్లు భారీగా పెరిగింది. మన ఈక్విటీలను విదేశీ మదుపర్లు విక్రయించి, పెట్టుబడులు పట్టుకెళ్లిపోతున్నారు. ఈ కారణాల వల్ల అమెరికా డాలర్‌కు గిరాకీ బాగా పెరిగింది. ఫలితంగా రూపాయి విలువ తగ్గిపోతోంది. దీంతో మన విదేశీ మారకపు ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని కాపాడుకునేందుకు ఆర్‌బీఐ 12 బిలియన్ డాలర్ల విలువైన పసిడిని విక్రయించినట్లు వార్తాసంస్థ బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. ఈ వార్తను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆర్‌బీఐ వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా 2025లో 13.92 శాతంగా ఉండగా.. 2026 మార్చి 31 నాటికి 16.70 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. మే 22 నాటికి ఆ మొత్తం 16.85 శాతానికి పెరిగిందని ఆర్‌బీఐ గణాంకాలను ఉదహరించింది. ఆర్‌బీఐ తన వద్ద ఫిజికల్ గోల్డ్ వివరాలను ఎప్పటికప్పుడు నెలవారీ బులెటిన్‌లో వెల్లడిస్తోందని పేర్కొంది. ఈ తేదీ వరకు అందులో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. కాబట్టి తప్పుడు సమాచారం నమ్మొద్దని సూచించింది. అధికారిక సమాచారం కోసం ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Jet fuel price cut | దిల్లీ: విమానయాన సంస్థలకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వరంగ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ విమానాల జెట్ ఇంధన (ATF) ధరలను 27 శాతం తగ్గించాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల కారణంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. దేశీయ విమాన ఇంధన ధరల్లో మాత్రం వరుసగా రెండో నెలా ఎలాంటి మార్పూ చేయలేదు. జూన్ నెలకు గాను అంతర్జాతీయ విమానాల జెట్ ఇంధన ధరను కిలోలీటరుకు సుమారు 400 డాలర్ల మేర చమురు సంస్థలు తగ్గించాయి. దీంతో కిలోలీటర్ 1100 డాలర్లకు చేరింది. ఈ తగ్గింపుతో అంతర్జాతీయ విమానాల ఇంధన ధరలు, దేశీయ విమాన ఇంధన ధరలు దాదాపు సమాన స్థాయికి చేరాయి. అంతర్జాతీయ విమాన ఇంధన ధర కిలో లీటరుకు రూ.1,05,000గా ఉండగా.. ప్రస్తుతం దిల్లీలో దేశీయ విమాన ఇంధన ధర కిలోలీటరుకు రూ.1,04,927గా ఉంది. అంతకుముందు దేశీయ విమానాలకు ఏప్రిల్ 1న కిలోలీటరుకు 25 శాతం అంటే రూ.15వేలు చొప్పున పెంచగా.. అంతర్జాతీయ విమాన సర్వీసుల ఏటీఎఫ్ ధరలు మాత్రం రూ.73 వేలు పెంచారు. మే నెలలో అంతర్జాతీయ విమానాలకు ఏటీఎఫ్ ధరను కిలో లీటరుకు 76 డాలర్లు పెంచి 1511 డాలర్లుకు చేర్చారు. దేశీయ విమానాల ధరల్లో అప్పుడు ఏ మార్పూ చేయలేదు. జూన్‌లో మాత్రం కిలో లీటరుకు 400 డాలర్లు తగ్గించడం గమనార్హం. సాధారణంగా ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయంలో జెట్ ఫ్యూయల్‌కే 40 శాతం ఖర్చవుతుంది. ఇటీవలి పరిస్థితుల కారణంగా ఇది 55-60 శాతానికి పెరిగింది. పెరిగిన చమురు ధరలకు తోడు, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం వల్ల

ఇంటర్నెట్‌డెస్క్: దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్ల (GST Collections) వివరాలను సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. మే నెలలో రూ.1.94 లక్షల కోట్ల రాబడి నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 3.2 శాతం వృద్ధి కనిపించింది. ఇక రిఫండ్ల సర్దుబాటు అనంతరం మే నెలకు నికరంగా జీఎస్టీ వసూళ్లు రూ.1,66,904 కోట్లుగా ఉన్నాయి. మొత్తంగా రీఫండ్లు 2.6 శాతం పెరిగి, రూ.27,281కోట్లుగా ఉన్నాయి. దేశీయ రీఫండ్లు 4.3 శాతం తగ్గగా.. ఎగుమతి ఆధారిత రీఫండ్లు 16.6 శాతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే.. స్థూల దేశీయ జీఎస్టీ రాబడి 2.6 శాతం తగ్గింది. ఆ మొత్తం రూ.1.34 లక్షల కోట్లుగా ఉంది. అదే సమయంలో దిగుమతులపై వసూళ్లు 19.1 శాతం పెరిగి, రూ.59,654 కోట్లుగా ఉన్నాయి. కాగా.. ఏప్రిల్, మే నెలల్లో జీఎస్టీ (GST) వసూళ్లు 6.2 శాతం పెరిగి, 4.37 లక్షలకోట్లకు చేరాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.