
సింధు జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గేది లేదని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. సింధు జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గేది లేదని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ చర్యలు తమ నీటి సరఫరాకు ముప్పు కలిగిస్తున్నాయని, అవసరమైతే ఆ దేశంపై యుద్ధానికి వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా హెచ్చరించారు (Indus Waters Treaty). పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదానికి పూర్తిగా, విశ్వసనీయంగా అడ్డుకట్ట వేయకపోతే ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని భారత్ తేల్చి చెప్పింది. కాగా, పాకిస్థాన్‌కు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించే లేదా అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే అది జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని ఆసిఫ్ (Khawaja Asif) అన్నారు. పాక్ ఆర్థిక వ్యవస్థ, కోట్లాది మంది ప్రజల జీవనాధారం సింధు నదీ వ్యవస్థపై ఆధారపడి ఉందని ఆసిఫ్ అన్నారు. ఈ నేపథ్యంలో నీటి హక్కులను కాపాడుకునేందుకు అన్ని మార్గాలనూ ఉపయోగిస్తామని, అవసరమైతే యుద్ధం వరకు వెళ్లడానికి కూడా వెనుకాడబోమని ఆసిఫ్ హెచ్చరించారు. సింధు జలాల ఒప్పందం 1960లో కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ వ్యవస్థలోని ఆరు నదులను భారత్, పాకిస్థాన్‌కు సమానంగా కేటాయించారు (India Pakistan Water Dispute). ఈ ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు హక్కులుంటాయి. సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్థాన్‌కు హక్కులుంటాయి. అలాగే పాకిస్థాన్‌కు కేటాయించిన మూడు నదులపై కూడా భారత్‌కు కొన్ని పరిమిత హక్కులు ఉన్నాయి. పాక్‌కు కేటాయించిన నదులపై భారత్ జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు. తాగునీరు, గృహ అవసరాలకు నీటిని వినియోగించుకోవచ్చు. అలాగే పరిమిత స్థాయిలో సాగునీటికి కూడా ఉపయోగించుకోవచ్చు

.webp)


