శ్రీలీలకు అవమానం... వివాదంలో మహారాష్ట్ర సీఎం భార్య
Actor ProfilePolitician

శ్రీలీలకు అవమానం... వివాదంలో మహారాష్ట్ర సీఎం భార్య

📊 Box Office Collections
Total News3
Movie Updates0
Sources1
యూఎస్ లో మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్.. సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ గా సమంత
Samayam Telugu28 Jun 2026
యూఎస్ లో మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డ్.. సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ గా సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘ మా ఇంటి బంగారం ’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో విడుదలైన

బాక్సాఫీస్ వద్ద జూన్ జోరు… అఖిల్ కి ఇదే మంచి ఛాన్స్, లెనిన్’ తో ఆ లోటు తీర్చేస్తాడా
Samayam Telugu28 Jun 2026
బాక్సాఫీస్ వద్ద జూన్ జోరు… అఖిల్ కి ఇదే మంచి ఛాన్స్, లెనిన్’ తో ఆ లోటు తీర్చేస్తాడా

గత కొంతకాలంగా సరైన విజయాలు లేక కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తూ నిరాశలో మునిగిపోయిన టాలీవుడ్‌లో ఇప్పుడు మళ్లీ ఒక సరికొత్త ఊపు, పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. జనవరిలో సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత

శ్రీలీలకు అవమానం... వివాదంలో మహారాష్ట్ర సీఎం భార్య, ముంబై యోగా ఈవెంట్లో అసలేం జరిగింది
Samayam Telugu28 Jun 2026
శ్రీలీలకు అవమానం... వివాదంలో మహారాష్ట్ర సీఎం భార్య, ముంబై యోగా ఈవెంట్లో అసలేం జరిగింది

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ముంబైలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ ప్రత్యేక కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ , బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్, టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల తదితరులు పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. శారీరక, మానసిక దృఢత్వానికి యోగా ఎంత అవసరమో చెప్తూ అమృత ఫడ్నవీస్ అందరికీ పిలుపునిచ్చారు. అంతవరకు బాగానే ఉన్నా, ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. స్టార్ హీరోయిన్ శ్రీలీలను అమృత ఫడ్నవీస్ అవమానించారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.అసలేం జరిగిందంటే..?యోగా వేడుకల అనంతరం అమృత ఫడ్నవీస్, ఆమె కుమార్తె, శ్రీలీల కలిసి మీడియా ప్రతినిధులకు గ్రూప్ ఫొటోల కోసం ఫోజులిచ్చారు. అయితే ఆ సమయంలో అక్కడున్న జర్నలిస్టులు కొందరు కేవలం అమృత ఫడ్నవీస్, ఆమె కుమార్తె ఫొటోలు మాత్రమే కావాలని కోరారు. దాంతో ఆమె స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది. పక్కనే ఉన్న స్టార్ హీరోయిన్ శ్రీలీలకు మర్యాదగా చెప్పకుండా, చేతి వేళ్లతో సైగ చేస్తూ పక్కకు తప్పుకోవాలంటూ ఆమె చేసిన సంకేతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అమృత ప్రవర్తనకు ఒక్కసారిగా షాకైన శ్రీలీల ఎలా రియాక్ట్ కావాలో తెలియక బేల చూపులు చూస్తూ కాస్త దూరంగా నిలబడిపోయింది. ఒక అగ్ర కథానాయిక పట్ల అమృత ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదని, అలా వేళ్లతో సైగ చేస్తూ పక్కకు వెళ్లమనడం కరెక్ట్ కాదని, అది శ్రీలీలను అవమానించడమేనని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. క్రేజీ స్టార్‌గా శ్రీలీల ప్రస్థానం ఈ వివాదం పక్కన పెడితే, ప్రస్తుతం సినీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా శ్రీలీల దూసుకుపోతోంది. 2019లో కన్నడ చిత్రం 'కిస్' ద్వారా వెండితెరకు పరిచయమై తొలి చిత్రానికే 'సైమా' బెస్ట్ డెబ్యూ అవార్డు అందుకున్న ఈ బ్యూటీ

శ ర ల లక అవమ న వ వ ద ల మహ ర ష ట ర స ఎ భ ర య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in