మెట్రో ఫేజ్
Actor ProfilePolitician

మెట్రో ఫేజ్

Total News9
Movie Updates0
Sources6
మొదటి రోజు పాఠశాలల్లో తగ్గిన హాజరు
Vaartha15 Jun 2026
మొదటి రోజు పాఠశాలల్లో తగ్గిన హాజరు

Telangana schools:తెలంగాణ పాఠశాలల్లో అమావాస్య ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. వేసవి సెలవుల తర్వాత సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బడులు తెరిచినప్పటికీ, మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగా

కేసీఆర్ తిట్టినట్లు నేను తిట్టలేదు.. రూ. 13,600 కోట్లు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారు
Samayam Telugu15 Jun 2026
కేసీఆర్ తిట్టినట్లు నేను తిట్టలేదు.. రూ. 13,600 కోట్లు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారు

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు ఆలస్యంపై.. కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం ఎల్ అండ్ టీ నుంచి ఫస్ట్ ఫేజ్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం

మెట్రో ఫేజ్-2 ఆలస్యంపై కిషన్ రెడ్డిని నిలదీసిన రేవంత్ రెడ్డి
Zee Telugu15 Jun 2026
మెట్రో ఫేజ్-2 ఆలస్యంపై కిషన్ రెడ్డిని నిలదీసిన రేవంత్ రెడ్డి

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

మెట్రో ఫేజ్ -2ను అడ్డుకున్నది ఆ ముగ్గురే
Eenadu15 Jun 2026
మెట్రో ఫేజ్ -2ను అడ్డుకున్నది ఆ ముగ్గురే

హైదరాబాద్‌: మెట్రో రైలు నిర్మాణంలో హైదరాబాద్‌ కంటే ఇతర నగరాలు ముందున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. మొదటి దశలో రూ.15 వేల కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ వ్యయం రూ.22 వేల కోట్లకు పెరిగిందన్నారు. కేసీఆర్‌ పాలనలో ప్రజలు ప్రయాణించాల్సిన ప్రాంతాల్లో మెట్రో విస్తరణ జరగలేదని విమర్శించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సెకండ్‌ ఫేజ్‌లో మెట్రో విస్తరణ అనుమతి కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. అయితే, ఏడాదికి రూ.400 కోట్ల నష్టం వస్తుందని ఎల్‌అండ్‌టీ చెప్పిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల మెట్రో విస్తరణకు ఆ సంస్థ ఒప్పుకోవట్లేదని వివరించారు. ‘‘రూ.30వేల కోట్ల ఎల్‌అండ్‌టీ ఆస్తుల్ని రూ.15వేల కోట్లకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఎల్‌అండ్‌టీకి రూ.13,600 కోట్ల అప్పు ఉంది. ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి ఎల్‌అండ్‌టీకి రూ.13,600 కోట్ల రుణాలు ఇప్పించాం. ఆ మొత్తానికి 4 శాతం వడ్డీగా రుణం ఇప్పించాం. రేవంత్‌రెడ్డిని తేలికగా పని చేయిస్తే.. తెలంగాణలో భాజపాకి ఇబ్బందులు వస్తాయని సహచర కేంద్రమంత్రులు మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, అశ్వినీ వైష్ణవ్‌కు కిషన్‌రెడ్డి చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా.. లోన్‌ డబ్బులు ఎల్‌అండ్‌టీకి ట్రాన్స్‌ఫర్‌ కాలేదు. ఐఆర్‌ఎఫ్‌సీ లోన్‌ మంజూరు చేయకుండా కిషన్‌రెడ్డి అడ్డుకున్నారు. తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్‌లో ఉన్న కిషన్‌రెడ్డికి నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత లేదా? కేసీఆర్‌, కేటీఆర్‌ కలిసి ఆయన మెట్రో ఫేజ్‌-2ను అడ్డుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు కేసీఆర్‌ సహకరించినందుకు కిషన్‌రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారు’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత

మెట్రో ఫేజ్ -2 ను అడ్డుకుంటుంది కిషన్ రెడ్డే..? సీఎం రేవంత్
Sakshi15 Jun 2026
మెట్రో ఫేజ్ -2 ను అడ్డుకుంటుంది కిషన్ రెడ్డే..? సీఎం రేవంత్

సాక్షి, హైదరాబాద్: మెట్రో ఫేజ్‌-2 పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఉండాలా లేదా అని కిషన్‌ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించడంతో ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు ఆపేసిందన్నారు. ఈ రోజు (సోమవారం) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సాఆర్‌ హాయంలోనే హైదరాబాద్‌లో మెట్రో రైలుకు టెండర్లు పిలిచారని రేవంత్ తెలిపారు. మెట్రోను ఆపడానికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, కేటీఆర్‌ కుట్రలు చేస్తున్నారని మెట్రో ఫేజ్‌-2 పనులకు కిషన్‌ రెడ్డి సహకరిస్తే ఒక మెట్లో స్టేషన్‌కు ఆయన పేరు పెడతామని తెలిపారు. కిషన్ రెడ్డి పట్ల తనకు వ్యతిరేకత లేదని మెట్రో విషయంలో ఆయన ధైర్యంగా ఉంటే తాను అండగా ఉంటాను. మెట్రో విషయంలో కేంద్రం వెంటనే లోన్ రిలీజ్‌ చేయకపోతే ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలిస్తామన్నారు. కిషన్‌ రెడ్డి కేంద్రమంత్రి కాబట్టి నిధుల అంశం ఆయనను అడుగుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. కేంద్రమంత్రులను వ్యక్తిగతంగా కలిసి పరిస్థితులు వివరించాను. మెట్రోకు నష్టాలు రాకుండా లాభాల కోసం రకరకాల సంస్థలను సంప్రదించామని. ఫేజ్-1 వరకూ యజమానులు మీరయితే ఫేజ్‌-2 అనుమతులు ఈజీగా వస్తాయని కేంద్రం చెప్పిందని అయినప్పటికీ నిధులు విడుదల చేయడం లేదన్నారు. హైదరాబాద్‌ని విశ్వనగరమని చెప్పుకుంటుంన్నాం దానికి తగ్గట్లు అంతర్జాతీయ నగరానికి ఉండేలా సదుపాయలు కూడా ఉండాలి. ఫేజ్‌-2 అనుమతి కోసం కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాం మరో 122 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ జరగాలని కోరాం. ప్రస్తుతం మెట్రోకు కిలోమీటర్‌కు రూ. 350 కోట్ల ఖర్చువుతుందని ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల కోటి 34 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ : ప్రసాద్ ఐమాక్స్ వద్ద భారీ అనంత పద్మనాభస్వామి (ఫొటోలు) ‘ఓ..! సుకుమారి’ మూవీ టీజర్‌ లాంచ్‌లో ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు) 'అందరి చూపు అటువైపే' ఏముంది

మెట్రో ఫేజ్-2 మంజూరు చెయ్యండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
Vaartha12 Jun 2026
మెట్రో ఫేజ్-2 మంజూరు చెయ్యండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్

Hyderabad Metro Phase-2 : తెలంగాణ రాజధాని, విశ్వనగరం హైదరాబాద్‌లో ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా...

ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ.. హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్
10TV Telugu11 Jun 2026
ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ.. హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్

మోదీతో సీఎం రేవంత్ భేటీ అభివృద్ధి, మెట్రో ఫేజ్–2 ఖట్టర్ సమావేశం మూసీ ప్రక్షాళన పట్టణాభివృద్ధి ప్రణాళికలు Narendra Modi: నీతి ఆయోగ్ సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)తో

మెట్రో ఫేజ్-2, , 12 లేన్ల ఎక్స్ ప్రెస్ వే.. ప్రధాని మోదీతో భేటీలో రేవంత్ రెడ్డి చర్చ
Samayam Telugu11 Jun 2026
మెట్రో ఫేజ్-2, , 12 లేన్ల ఎక్స్ ప్రెస్ వే.. ప్రధాని మోదీతో భేటీలో రేవంత్ రెడ్డి చర్చ

నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇదే పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్రమంత్రులను కలిశారు. నీతి ఆయోగ్...

మెట్రో ఫేజ్ -2 విస్తరణకు ఆమోదం తెలపండి
Eenadu11 Jun 2026
మెట్రో ఫేజ్ -2 విస్తరణకు ఆమోదం తెలపండి

దిల్లీ: తెలంగాణకు కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi)ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కోరారు. దిల్లీలో ప్రధానితో సీఎం భేటీ...