
హైదరాబాద్: మెట్రో రైలు నిర్మాణంలో హైదరాబాద్ కంటే ఇతర నగరాలు ముందున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొదటి దశలో రూ.15 వేల కోట్లతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ వ్యయం రూ.22 వేల కోట్లకు పెరిగిందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రయాణించాల్సిన ప్రాంతాల్లో మెట్రో విస్తరణ జరగలేదని విమర్శించారు.
సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సెకండ్ ఫేజ్‌లో మెట్రో విస్తరణ అనుమతి కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. అయితే, ఏడాదికి రూ.400 కోట్ల నష్టం వస్తుందని ఎల్అండ్టీ చెప్పిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల మెట్రో విస్తరణకు ఆ సంస్థ ఒప్పుకోవట్లేదని వివరించారు.
‘‘రూ.30వేల కోట్ల ఎల్అండ్టీ ఆస్తుల్ని రూ.15వేల కోట్లకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఎల్అండ్టీకి రూ.13,600 కోట్ల అప్పు ఉంది. ఐఆర్ఎఫ్సీ నుంచి ఎల్అండ్టీకి రూ.13,600 కోట్ల రుణాలు ఇప్పించాం. ఆ మొత్తానికి 4 శాతం వడ్డీగా రుణం ఇప్పించాం.
రేవంత్‌రెడ్డిని తేలికగా పని చేయిస్తే.. తెలంగాణలో భాజపాకి ఇబ్బందులు వస్తాయని సహచర కేంద్రమంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్‌కు కిషన్‌రెడ్డి చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా.. లోన్ డబ్బులు ఎల్అండ్టీకి ట్రాన్స్ఫర్ కాలేదు.
ఐఆర్ఎఫ్సీ లోన్ మంజూరు చేయకుండా కిషన్‌రెడ్డి అడ్డుకున్నారు. తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్లో ఉన్న కిషన్‌రెడ్డికి నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత లేదా? కేసీఆర్, కేటీఆర్ కలిసి ఆయన మెట్రో ఫేజ్-2ను అడ్డుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు కేసీఆర్ సహకరించినందుకు కిషన్‌రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారు’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
అమ్మ ప్రేమను, అవకాయ రుచిని, హైదరాబాద్ నగరాన్ని ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో విద్యార్థులు బడిబాట పట్టారు. పాఠశాలలకు తొలిరోజు వస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. అల్పాహారం ఏర్పాటు చేశారు. ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. వేసవి సెలవులతో బోసిపోయిన పాఠశాలలు సందడిగా మారాయి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత