
Kavitha Boggubayi Yatra: సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బొగ్గుబాయి యాత్రలో భాగంగా సోమవారం మంచిర్యాలలో


Kavitha Boggubayi Yatra: సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బొగ్గుబాయి యాత్రలో భాగంగా సోమవారం మంచిర్యాలలో

Bhatti Vikramarka Birthday: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక

Telangana Politics:ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2028 ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇప్పటికే ఇచ్చిన హామీలు చేయాల్సిన పనులు పార్టీ పరిస్థితులు కాంగ్రెస్ వైఫల్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మహబూబ్నగర్ ప్రజలు కాంగ్రెస్ను, రేవంత్ రెడ్డిని తరిమికొడతారని అన్నారు. పాలమూరు ప్రాజెక్టును పక్కనపెట్టి, పాలమూరు ప్రజలకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి.. బీఆర్ఎస్ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మహబూబ్నగర్ ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. Read also: Revanth Reddy: వర్షాల నేపథ్యంలో అధికారుల సమన్వయ లోపంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ దాదాపుగా పూర్తయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి, కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం లక్షల ఎకరాల పంటలకు నీరందకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం ప్రతి ఒక్కరికీ అర్థమైందన్నారు. మహబూబ్నగర్ బిడ్డనని పదేపదే చెప్పుకుంటూ జిల్లా ప్రజలను మోసం చేస్తూ, అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కూడా తరిమికొడతారని కేటీఆర్ స్పష్టం చేశారు. కేవలం మాటలు చెప్పి, ప్రకటనలకు పరిమితమైతే జిల్లా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని ఇప్పటికే అందరికీ తెలిసిపోయిందన్నారు. జిల్లా ప్రజలకు చేయాల్సిన అభివృద్ధిని, పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను పక్కనపెట్టి కేవలం రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు