
ఇంటర్నెట్‌ డెస్క్‌: విమానంలో ఓ మహిళ నగ్నంగా తిరుగుతూ అసభ్యంగా ప్రవర్తించడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో విమానం ల్యాండ్‌ అయిన వెంటనే పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బాల్టిమోర్‌ నుంచి మియామీ వెళ్తున్న అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ (American Airlines) విమానంలో చోటుచేసుకుంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బాల్టిమోర్‌ నుంచి అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ (American Airlines) విమానం 160 మంది ప్రయాణికులతో మియామీకి బయల్దేరింది. కొంత దూరం వెళ్లిన తర్వాత ఓ ప్రయాణికురాలు తన దుస్తులు తొలగించి, గట్టిగా అరుస్తూ అటూఇటూ తిరగడం ప్రారంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది బలవంతంగా ఆమెను సీట్‌లో కూర్చోబెట్టి.. పైలట్‌లను అప్రమత్తం చేశారు. మియామీ విమానాశ్రయ సిబ్బందికి, ఎయిర్‌లైన్స్‌కు సమాచారం ఇచ్చారు. విమానాన్ని వెనక్కి మళ్లించకుండా ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న సిబ్బంది.. గమ్యస్థానానికి చేరుకోగానే పోలీసులకు అప్పగించారు. ఆమె ప్రవర్తనకు గల కారణాలు తెలుసుకొనేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఈ నెల 11న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదీ చదవండి: ‘యూకే బ్రేకప్‌’ కోసం సంతకాలు.. ఒంటరికానున్న ఇంగ్లాండ్..! .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





