
ఆదిలాబాద్ నేర విభాగం: అనుమతి లేకుండా డీజే ఏర్పాటు చేసినందుకు డీజే యజమానిపై కేసు నమోదైంది. ఈ ఘటన ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్‌లో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి వినాయక ప్రతిష్టాపన సందర్భంగా గణపతి మండప కమిటీ సభ్యులు డీజే ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా డీజే ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులు, డీజే యజమాని మహమ్మద్ అబ్దుల్ బషీర్‌పై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె.నాగరాజు తెలిపారు. డీజే, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు నిబంధనలు పాటిస్తూ అధిక శబ్దం వచ్చే డీజేలను ఏర్పాటు చేయవద్దని, డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





