
ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రం భుక్తాపూర్ కాలనీలోని శ్రీ పరశురామ్ భవన్‌లో సనాతన హిందూ ఉత్సవ సమితి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నాలుగవ సారి ప్రమోద్ కుమార్ ఖత్రి ఎన్నిక కాగా, గౌరవ అధ్యక్షులుగా కందుల రవీందర్, మామిడి రాజు, ప్రధాన కార్యదర్శిగా రేణికుంట రవీందర్, కోశాధికారిగా సంతోష్ అగర్వాల్, ఉపాధ్యక్షులుగా సమనపల్లి నర్సింలు, సురేష్ పావుడ్వాల్, మహిపాల్, కార్యనిర్వహక అధ్యక్షులుగా దశరథ్, జాయింట్ సెక్రటరీలుగా మీసాల స్వామి, సుభాష్ ఊరడే, విజయ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ ఖత్రి మాట్లాడుతూ.. సభ్యులందరూ తనపై నమ్మకంతో తిరిగి నాలుగవ సారిగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తునాన్నని పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





