
మిర్యాలగూడ పట్టణం: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించడమే మేలని కస్తూరి ఫౌండేషన్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ గుడిపాటి కోటయ్య అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కస్తూరి శ్రీ చరణ్ సౌజన్యంతో మిర్యాలగూడలో సోమవారం మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏటా సుమారు పదివేల వరకు మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ సభ్యులు అంబటి వీరనారాయణ, చిలుక నరేందర్ రెడ్డి, షేక్ ఉస్మాన్, యాదవ సంఘం పట్టణ అధ్యక్షులు కట్టెబోయిన శ్రీనివాస్, గుడిపాటి వివేక్ యాదవ్, అంబటి శ్రీను, వడ్డేపల్లి వెంకటేష్, రాపోలు పరమేష్, కురువ తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





