
భీమడోలు : ఏలూరు జిల్లా భీమడోలు మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మండపాల్లో కొలువుదీర్చిన గణనాథులకు ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంలోని గణపతి సెంటర్‌లో కొలువుదీరిన ప్రసిద్ధ శ్రీ మన్మహాగణపతి ఆలయంలో 62వ వార్షిక ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరు అడుగుల సంప్రదాయ మట్టి గణపతి విగ్రహాన్ని మేళతాళాలు, మంగళవాయిద్యాలు, బాణసంచా నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం వెలుపల శాస్త్రోక్తంగా కొలువుదీర్చారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా శ్రీ మన్మహాగణపతి స్వామివారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు గంధం భాస్కరరావు, ఈడే సత్యనారాయణ, గోపిశెట్టి రమేష్, చిన్నారి తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





