
మదురవాడ: మధురవాడలోని చంద్రంపాలెంలో శ్రీ కార్యసిద్ధి గణపతి మహోత్సవాలు సోమవారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలో ప్రతిష్ఠించిన ఈ గణనాథుడు భీమిలి నియోజకవర్గంలోనే అత్యంత ఎత్తైనది కావడం విశేషం. గతేడాది 41 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. ఈ ఏడాది మరింత భక్తిశ్రద్ధలతో విగ్రహం ఎత్తును 45 అడుగులకు పెంచి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నసంతర్పణ కార్యక్రమం, 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు 111 కేజీల మహా లడ్డూ వేలంపాట నిర్వహించనున్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ, గ్రామ పెద్దలు, యువత తెలిపారు. గణేష్ నగర్‌లో ఆకట్టుకుంటున్న భారీ సెట్ మధురవాడ : విశాఖ జిల్లా మధురవాడలోని గణేష్ నగర్‌లో ‘ఫోర్ ద పీపుల్ టీమ్’యూత్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమాయ్యాయి. గత 22 ఏళ్లుగా ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాలతో సామాజిక ఐక్యతే లక్ష్యంగా నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ప్రత్యేకంగా ప్రతిష్ఠించిన 12 అడుగుల గణనాథుడి విగ్రహం, దానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన 35 అడుగుల భారీ సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ నవరాత్రి ఉత్సవాల్లో స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





