
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్‌లో ఉన్న మహా గణేశుడికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా మరియు ఆయన భార్య మొదటి పూజ చేశారు. ఈ పూజ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్‌లో ఉన్న మహా గణేశుడికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా మరియు ఆయన భార్య మొదటి పూజ చేశారు. ఈ పూజ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ మరియు నగర ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గవర్నర్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్, బడా గణేశుడిని పూజించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఖైరతాబాద్ వాసుల ఆరోగ్యం, సుఖసంతోషాలు, మరియు సమృద్ధిని గణేశుడు కాపాడాలని ఆయన ప్రార్థించారు. దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించి, భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు. ఖైరతాబాద్ గణేశుడు భక్తులందరినీ ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేసే శక్తిని తనకు అందించాలని కోరుకున్నానన్నారు. గణేశ్ ఉత్సవాలు మహారాష్ట్రలో ప్రారంభమైనప్పటికీ, ఖైరతాబాద్ గణేశుడి ప్రతిమకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్ చెప్పారు. 72 సంవత్సరాలుగా ఖైరతాబాద్‌లో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడం విశేషమన్నారు. గణేశ్ చతుర్థి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని గవర్నర్ చెప్పారు. గణనాథుడికి తొలి పూజ చేయడం తనకు ఆనందంగా ఉందని, ప్రజలు ఆయురారోగ్యాలు మరియు సంతోషాలతో ఉండాలని కోరారు. అంతకుముందు, ఖైరతాబాద్ గణేశుడికి పూజ చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్, మూడు నెలల నుంచి గణపతి ఉత్సవాల కోసం సిద్ధమవుతున్నామని తెలిపారు. పోలీస్, ఆర్ అండ్ బీతో పాటు అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎటువంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఆదివారం ఒక్క రోజే 15 వేల మంది గణపతి దర్శనానికి వచ్చారని చెప్పారు. ఈసారి మొత్తం 30 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖులు బడా గణేశుడ్ని దర్శించుకున్నట్లు వెల్లడించారు.





