
హైదరాబాద్‌: ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి.. ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. భార్య, కుమార్తె, అల్లుడు, మనవడు అంతా గణపతి పూజలో పాల్గొన్నారు. వాడవాడలా ఏర్పాటు చేసే గణేశ్‌ మండపాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని ప్రజలకు ముఖ్యమంత్రి సూచించారు. గణపతి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని.. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వినాయక మండపాలకు ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు సీఎం వివరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. జగిత్యాల(Jagitial) జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మరోసారి తన ప్రతిభను చాటారు.




