
మక్తల్: పట్టణంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ముందుగా చిన్న గణపతుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం వాటిని శోభాయాత్రగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక పూజలకు హాజరై అనంతరం భక్తులతో కలిసి వినాయక శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మక్తల్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి వేడుకలను భక్తి, శాంతి, సోదరభావంతో నిర్వహించాలని కోరారు. శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయక నామస్మరణతో పట్టణాన్ని మార్మోగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




