
మేష రాశి వారికి ఈ వారం గ్రహాలు, వినాయకుని అనుగ్రహంతో శుభ ఫలితాలు రానున్నాయి. కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రాజెక్టులు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ మనసులోని కోరికలు నెరవేరొచ్చు. మరోవైపు భావోద్వేగా కారణాల వల్ల మీ ఖర్చులు పెరగొచ్చు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారం ప్రారంభంలో కొన్ని ప్రతికూల వార్తలు వినొచ్చు. వారం చివర్లో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. పరిహారం : ప్రతిరోజూ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి. వృషభ రాశి వారికి ఈ వారం విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులో పని చేసే అవకాశం లభించొచ్చు. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. ఈ వారంలో మీ ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. మరోవైపు ఈ వారం మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ ప్రేమ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకునేందుకు మరింత కష్టపడాలి. వారం చివర్లో ఏవైనా సమస్యలను ఓపికతో పరిష్కరించడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీ జీవితం ప్రశాంతంగా మారుతుంది. పరిహారం : ప్రతిరోజూ గణేష్ చాలీసా పఠించాలి. మిథున రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో గణనీయమైన మార్పలు రావొచ్చు. మీరు చేసే ప్రయాణంలో మంచి విజయం సాధించొచ్చు. మీ పెండింగ్ పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. గతం కంటే మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీరు కొన్ని ప్రాజెక్టులో మంచి విజయం సాధించొచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి. పరిహారం : ఈ వారం వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించి, పూజలు చేయాలి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఫలితాలు రానున్నాయి. ఈ వారం మీరు చేసే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అధిక పని భారం కారణంగా మీకు నిద్రలేమి సమస్యలు ఎదురుకావొచ్చు. ఇది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని వార్తలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. వారం చివరి నాటికి పరిస్థితులు మెరుగుపడొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు గురువుల ఆశీస్సులు పొందొచ్చు. పరిహారం : ఈ వారం గణేష్ చాలీసా పఠించాలి. సింహ రాశి వారికి ఈ వారం కెరీర్ పరంగా మంచి పురోగతి లభించే అవకాశం ఉంది. మీ కోరికలు నెరవేరొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ వారం మీరు చేసే ప్రయాణాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ కుటుంబంలో ఒత్తిడిని అధిగమించొచ్చు. మీ ప్రేమ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వారం చివర్లో సమస్యలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తారు. పరిహారం: ఈ వారం వినాయకుడిని ఆరాధించాలి. కన్య రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు పెట్టిన పెట్టుబడులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ వారం మీరు చేసే ప్రయాణాలు మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉంటాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు రావొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ మనసులో కోరికలన్నీ నెరవేరాలంటే మరింత కష్టపడాలి. పరిహారం : ఈ వారం లక్ష్మీగణపతిని పూజించాలి. తులా రాశి వారికి ఇదే రాశిలో శుక్రుడి సంచారం కారణంగా ఈ వారం శుభ ఫలితాలు రానున్నాయి. మాళవ్య రాజయోగం, వినాయకుడి అనుగ్రహంతో మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ఉద్యోగులు కొన్ని పెద్ద ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశాన్ని పొందొచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి రావొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయటి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరిహారం : ఈ వారం గణేష్ చాలీసా పఠించాలి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రాననున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వారం మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపేందుకు అవకాశాలను పొందుతారు. పరిహారం : ఈ వారం వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ధనస్సు రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. శుభ యోగాల ప్రభావంతో మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ఇంటికి కొత్త అతిథిని ఆహ్వానించే అవకాశం ఉంది. మీ మనసులో ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం మెరుగ్గా ఉంటుంది. ఈ వారం మీరు చేసే ప్రయాణం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వారం చివర్లో అంతా ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. పరిహారం : ఈ వారం లంబోదరుడికి ప్రత్యేక పూజలు చేయాలి. మకర రాశి వారికి ఈ వారం శుభ యోగాలు ప్రభావం, వినాయకుడి అనుగ్రహంతో శుభ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనిలో పురోగతి లభించనుంది. వారం ప్రారంభంలో ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ ఇంట్లో పనికి సంబంధించి గణనీయమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. మీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. మీ ప్రేమ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఈ వారం మీరు చేసే ప్రయాణాల్లో కొన్నిసవాళ్లు ఎదురవుతాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. వారం చివర్లో కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. పరిహారం : ఈ వారం వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించి, ప్రత్యేక పూజలు చేయాలి. కుంభ రాశి వారికి ఈ వారం వినాయకుడి అనుగ్రహంతో శుభప్రదంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి రావొచ్చు. మీ ప్రేమ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడొచ్చు. ఈ వారం మీరు చేసే ప్రయాణాలన్నింట్లో మెరుగైన ఫలితాలు పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వారం చివర్లో కొన్ని అశుభవార్తలు వినొచ్చు. దీంతో మీ మనసులో అశాంతిగా ఉంటుంది. పరిహారం : ఈ వారం గణేష్ చాలీసా పఠించాలి. మీన రాశి వారికి ఈ వారం గ్రహాల అనుగ్రహంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ప్రేమ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి అన్ని రంగాల్లో మద్దతు లభించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడొచ్చు. ఈ వారం మీరు చేసే ప్రయాణాల్లో మంచి విజయాలు సాధించొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ప్రయత్నాలు చేస్తారు. భావోద్వేగ కారణాల వల్ల కొన్ని ఖర్చులు పెరగొచ్చు. అయితే వారం చివర్లో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. పరిహారం : ఈ వారం ఏకదంతుడికి ప్రత్యేక పూజలు చేయాలి. గమనిక : ఇక్కడ అందించిన భక్తి, జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News




