
ఇంటర్నెట్‌ డెస్క్: ఎప్పుడూ అభిమానులకు అందుబాటులో ఉంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) . తాజాగా కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో ఓ కంటెస్టెంట్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్‌గా మారింది. ఈవెంట్‌లు, వేడుకలకు వెళ్లేటప్పుడు తన భార్య జయా బచ్చన్ సమయానికి రెడీ అయ్యేలా చేయడానికి తాను ఉపయోగించే ఓ ఫన్నీ ట్రిక్‌ను బిగ్‌బీ బయటపెట్టారు. ‘‘మేము ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ముందుగానే ఒక టైమ్ అనుకుంటాం. కానీ, నేను మాత్రం ఆమెకు అసలు సమయం కంటే ఒక గంట ముందే టైమ్ చెప్తాను. అదే అసలు టైమ్‌ అనుకొని ఆమె రెడీ కావడం ప్రారంభిస్తుంది. అప్పుడే మేం సరైనా సమయానికి ఫంక్షన్‌కు వెళ్లగలం. సాయంత్రం 6 గంటలకు వెళ్లాల్సి ఉంటే.. నేను ఆమెకు 5 గంటలకే అని చెబుతాను. దాంతో ఆమె 4 గంటల నుంచే సిద్ధమవ్వడం మొదలుపెట్టి, అనుకున్న సమయానికి రెడీ అవుతుంది’’అని అమితాబ్‌ తెలిపారు. గతంలో కూడా ఇలాంటి ఓ ఫన్నీ విషయాన్ని అమితాబ్‌ పంచుకున్నారు. ఇంటికి ఆలస్యంగా వెళ్తే జయా బచ్చన్ (Jaya Bachchan) కోప్పడతారా.. అని ఒక కంటెస్టెంట్ అడగ్గా బిగ్‌బీ సరదాగా బదులిచ్చారు. ‘‘ఏం జరుగుతుందో నాకు ముందే తెలుసు. అందుకే ఉదయం లేవగానే మా ఫ్యామిలీ . నాకు షూటింగ్ ఉందని, ఇంటికి రావడం ఆలస్యమవుతుంది కాబట్టి డిన్నర్ కోసం నాకోసం వేచి చూడవద్దని ముందే చెప్పేస్తాను. అలా ముందుగానే చెప్పడం వల్ల నేను తిట్ల నుంచి తప్పించుకుంటాను. ఒకవేళ చెప్పడం మర్చిపోతే మాత్రం.. కచ్చితంగా ఆమె కోప్పడుతుంది’’ అని చెప్పారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





