
అదే ఆ యాక్సిడెంట్ ఎలా అయ్యింది అని అంటాడు సూరజ్. నేనూ నీలాగే వచ్చాను.. ఏం జరిగిందో నాకూ తెలియదు అని అంటుంది జ్యోత్స్న. మరోవైపు మాలిని.. శివన్నారాయణ ఆఫీస్‌లోకి వెళ్లి.. రైట్స్ జరిపిస్తూ ఉంటుంది. శివన్నారాయణ, దశరథ్‌లను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటారు బౌన్సర్స్. వాళ్లని తీసుకుని వెళ్లిన శివన్నారాయణ.. అసలు ఇక్కడేం జరుగుతుంది. నీకెంత ధైర్యం ఉంటే.. నా ఆఫీస్‌లోకి నన్నే నాకుండా ఆపుతావా? అని రంకెలు వేస్తాడు శివన్నారాయణ. ఏంటీ.. నీ ఆఫీస్నా? మా బోర్డ్ మెంబర్స్‌తో మీటింగ్ జరుగుతుంటే.. మీరొచ్చి నన్ను ఎందుకొచ్చావ్ అంటారేంటి? అని షాకిస్తుంది మాలిని. మా బోర్డ్ మెంబర్స్‌తో నీకు మీటింగ్ ఏంటి? మా ఆఫీస్‌లో నీ అధికారం ఏంటి? నేనొక్క ఫోన్ కొట్టానంటే వెళ్లి రోడ్డుపై పడతావ్ అని అంటాడు శివన్నారాయణ. అచ్చా.. అయితే కొట్టు బాబాయ్.. ఒక్కటి కాదు.. వంద కొట్టు. ఫోన్ కొట్టే ముందు నువ్వొక నిజాన్ని తెలుసుకోవాలి. ఈ బోర్డ్ మెంబర్స్ ఉన్నారే వీళ్లంతా నా బోర్డు మెంబర్స్.. వీళ్లంతా నా మనుషులు. తన రెస్టారెంట్‌ని అమ్ముతానన్నప్పుడు మీరు కొని నన్ను పక్కనపెట్టారు కదా.. కానీ అదంతా నేను ఆడించిన నాటకం. అది మీరు కొన్నాం అనుకున్నారు. మీరు కొనలేదు. మిమ్మల్నే మేం కొన్నాం. కళ్లు మూసుకుని కుటుంబం మొత్తం సంతకాలు పెట్టేశారు కదా.. కళ్లు తెరిచి చూస్తే ఈ రెస్టారెంట్ ఎవరి పేరున ఉందో తెలిసేది. మీరు జ్యోత్స్న రెస్టారెంట్స్‌కి రాసింది.. నా కొడుకు సూరజ్ పేరుపైన. ఇక నుంచి జ్యోత్స్న రెస్టారెంట్స్ మావి. గుడ్డిగా సంతకాలు పెట్టేశారు కదా.. ఏం చేస్తాం.. నీ టైమ్ బాలేదు బాబాయ్. చేసిన పాపాలు ఎక్కడికి పోతాయ్.. నీకు మరోట్విస్ట్ ఏంటంటే.. ఈ మేనేజర్ కూడా నా మనిషే. ఇతన్ని నువ్వు కొట్టావ్ కదా.. ఇప్పుడు నేను కొడితే ఎలా ఉంటుందో బాబాయ్‌కి చూపించాను. తండ్రీ కొడుకులు ఇద్దరూ షాక్‌లో ఉన్నారు కదా. ఇంకా అయిపోలేదు.. మీ పతనమే నా లక్ష్యం. నీ రెస్టారెంట్స్ పేరుపై బ్యాంక్‌లలో అడ్డగోలుగా లోన్లు తీసుకున్నావ్ కదా అని అంటుంది మాలిని. ఏంటీ నేను లోన్లు తీసుకున్నానా? అని అంటాడు ముసలోడు. ‘అదే బాబాయ్.. నీ పేరున నేను తీసుకున్నా.. నా కొడుకు, కాంచన కోడలు నీ దగ్గర చాలా సంతకాలు తీసుకున్నారు. ఒక్కసారైనా దీప సంతకం పెట్టమన్నప్పుడు ఆలోచించావా? ఇప్పుడు నీ నమ్మకమే నిన్ను ముంచేసింది’ అని అంటుంది మాలిని. దాంతో ముసలోడితో దీప ఎప్పుడెప్పుడు సంతకాలు పెట్టించుకుందో అవన్నీ గుర్తు చేసుకుంటాడు. అన్నీ బాగా గుర్తొచ్చాయా బాబాయ్.. అన్ని సంతకాలు పెట్టించుకుని ఆస్తులన్నీ తాకట్టు పెట్టించేశాను. ఈ జ్యోత్స్న రెస్టారెంట్‌తో సహా. ఇప్పుడు నీ షేర్స్‌పై కానీ.. ఈ కంపెనీపై కానీ నీకు ఏ అధికారం లేదు బాబాయ్ అని అంటుంది మాలిని. ఆ మాటతో కుప్పకూలిపోతాడు శివన్నారాయణ. పాపం బాబాయ్‌కి గుండెపట్టేసినట్టుంది.. వాటర్ తాగు బాబాయ్. అప్పుడే అయిపోలేదు. జ్యోత్స్న రెస్టారెంట్స్ తగలబడుతున్నాయ్. రైడ్స్ జరుగుతున్నాయి. ఉద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. నీ కళ్ల ముందే నీ సామ్రాజ్యాన్ని మొత్తం కూల్చేస్తున్నా.. నువ్వేం పీకలేవ్’ అని ముసలోడికి ఊపిరాడకుండా చేస్తుంది మాలిని. చైర్మన్ గారు సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గరే ఉన్నాయి మేడమ్.. కోర్టులో కేసు వేసినా కూడా మనమే గెలుస్తాం అని అంటాడు లాయర్. దాంతో మాలిని.. ‘ఇప్పుడు చెప్పు బాబాయ్.. వీళ్లంతా నా బోర్డు మెంబర్స్.. ఈ కంపెనీ నాది.. నీ షేర్స్ అన్నీ నావి.. మిమ్మల్ని రోడ్డుపాలు చేస్తాను. శివన్నారాయణ చచ్చిన పాము.. మాలిని గెలుపుని కళ్లారా చూస్తావ్’ అని అంటుంది మాలిని. దాంతో శివన్నారాయణ.. ఎరుగుతాడు కానీ.. మాలిని కోరలు పీకేస్తుంది. నువ్వు నన్నేం చేయలేవ్ బాబాయ్. నా భర్త చావుకి, నా మామకి చేసిన అవమానానికి, నా కొడుకుని కొట్టిన దానికి ఒకేసారి బదులు తీర్చుకున్నా.. అయినా వదిలిపెట్టను’ అని అంటుంది మాలిని. నన్ను ఇంత మోసం చేస్తారా? అని శివన్నారాయణ బోర్డ్మెంబర్స్ని అంటే.. వాళ్లు చేసింది మోసం అయితే నువ్వు చేసింది ఏంటి? వాళ్లు మోసం చేయలేదు.. నేను ఇచ్చిన ఆఫర్‌ని యాక్సెప్ట్ చేశారంతే.. ఇంకా ఇక్కడే ఉంటే గుండెపోటు వచ్చి పోయినా పోతాడు.. బాబాయ్‌ని తీసుకుని వెళ్లు అని అంటుంది మాలిని. నాకు గుండెపోటు రావడం కాదు.. నిన్నూ చంపేస్తా అంటూ మాలినిపైకి వెళ్తాడు ముసలోడు. బౌన్సర్లు వచ్చి పక్కకి లాగేస్తారు. నేను ఇచ్చిన షాక్‌కి బాబాయ్‌కి మతిపోయినట్టు ఉంది. మర్యాదగా బయటకు గెంటేయండి అంటూ బౌన్సర్లతో బయటకు నెట్టించేస్తుంది మాలిని. అంతా అయిపోయింది నాన్నా.. పూర్తిగా మోసపోయాం అని శివన్నారాయణ దగ్గర బాధపడతాడు దశరథ. ఇక హాస్పిటల్లో దీపకి ఏమౌతుందోనని టెన్షన్ పడుతూ ఉంటారు జ్యోత్స్న, సూరజ్‌లు. ఇంతలో డాక్టర్లు వచ్చి.. ఆమె బతకడం చాలా కష్టం. ఆవిడ ఇప్పుడు ప్రెగ్నెంట్.. కడుపుకి బలమైన దెబ్బ తగిలింది. రక్తం పోతుంది. వెంటనే ఆపరేషన్ చేయాలి.. అని అంటారు డాక్టర్లు. దాంతో జ్యోత్స్న.. వెంటనే ఆపరేషన్ చేయండి అని అంటుంది. ఆమె భర్తని పిలిపించండి.. ఫామ్‌పై సంతకం చేస్తేనే ఆపరేషన్ చేస్తాం అని అంటారు డాక్టర్. సంతకం నేను పెడతాను.. ఆమె నా వదిన అంటూ టకీ మని సంతకం పెట్టేయబోతాడు సూరజ్. ఆగూ.. నువ్వు సంతకం పెట్టడానికి వీళ్లేదు అని అంటుంది జ్యోత్స్న. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కదా.. ఆలస్యం అయితే దీప వదిన చనిపోతుంది.. వదిన చచ్చిపోయినా పర్లేదా? అని అంటాడు సూరజ్. అయినాసరే నువ్వు సంతకంపెట్టడానికి వీళ్లేదు.. ఆ సంతకం నేను పెడతాను.. నీకు తెలియని దీపకంటే.. నాకు తెలిసిన దీపే ఎక్కువ. ఈ సంతకం పెట్టడానికి నీకంటే నాకే ఎక్కువ అర్హత ఉంది అంటూ సంతకం చేస్తుంది జ్యోత్స్న. ఆపరేషన్ చేయాలంటే బ్లడ్ కావాలి.. తన బ్లడ్ గ్రూప్ హాస్పిటల్లో లేదు.. డోనర్ కావాలి అని అంటుంది డాక్టర్. దాంతో జ్యోత్స్న.. ‘మా ఇద్దరిదీ ఒకటే బ్లడ్ గ్రూప్.. నేను ఇస్తాను’ అని అంటుంది. ప్రాణం కాపాడాలన్నా అర్హత ఉండాలి.. ఆ అర్హత నీకు లేదు అని సూరజ్‌ని అంటుంది జ్యోత్స్న. అనంతరం దీపకి బ్లడ్ డొనేట్ చేస్తుంది జ్యోత్స్న. దీంతో డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటుంది. ఇక ఇంటికి వచ్చిన కార్తీక్.. దీప ఎక్కడికి వెళ్లిందోనని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సూరజ్.. హాస్పిటల్ వాళ్లతో కార్తీక్‌కి ఫోన్ చేయిస్తాడు. మరి కార్తీక్‌కి నిజం తెలిస్తే పరిస్థితి ఏంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.





