
స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆహార పదార్థాలు భద్రపరిచే ర్యాక్‌ల్లో వాలిన ఈగలు తరిగొప్పుల, న్యూస్‌టుడే: ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాల్సిన హోటల్‌ నిర్వాకులు కొందరు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తూ కాసులు దండుకుంటున్నారు.ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో ఈ విషయం తేటతెల్లమవుతోంది హానికర పదార్థాలతో.. : పలు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, స్వీట్స్‌ దుకాణాలు, కిరాణ దుకాణాల్లో ఆహార పదార్థాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని హోటళ్లలో రుచి కోసం వంటల్లో అల్లంపేస్టుల్లో హానికర రసాయన పదార్థం టార్జాజైన్‌ కలుపుతున్నారు. రంగులతో ప్రజలను ఆకర్షించడానికి.. మరికొన్ని బేకరీల్లో విక్రయించే బిస్కట్లు, దిల్‌ పసంద్, నూడుల్స్, మంచూరియాల్లో బుష్‌రంగు రసాయనం వాడుతున్నట్లు తెలిసింది. చాలాచోట్ల వాడిన నూనెలు మళ్లీమళ్లీ వినియోగిస్తున్నారు. ఈ అంశాలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరోవైపు వంటగదుల్లో చెత్త పేరుకుపోవడం, ఆహార పదార్థాలపై మూతలు లేకుండా ఉంచడంతో ఈగలు దోమలు చేరే పరిస్థితి దర్శనమిస్తుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల వంటకు ఉపయోగించే నీటి నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హోటళ్లలో ఆహార భద్రతా అధికారుల . జిల్లాలో సుమారు 500 హోటళ్లు ఉన్నాయి. 2026 జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు 90 హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేయగా ఐదు హోటళ్లను మూసివేశారు. 20 హోటళ్లకు నోటీసులు అందజేశారు. మరో 20 హోటళ్లకు రూ.2 లక్ష జరిమానా విధించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




