
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా విచిత్రపూర్ ప్రాంతంలోని బడపాహి అడవిలో రెస్క్యూ చేసిన ఐదు చిన్న ఒరాంగుటాన్ పిల్లలను, ప్రస్తుతం నందన్‌కానన్ జూ పార్క్ కు చెందిన క్వారంటైన్ వార్డులో 24 గంటల పర్యవేక్షణలో ఉంచారు. తల్లుల నుంచి వేరై, సుదీర్ఘ ప్రయాణం చేసి అలసి పోయి, పూర్తిగా కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టడాన్ని ఆ చిన్ని ప్రాణులు తట్టుకోలేకపోతున్నాయి. తీవ్ర మానసిక ఆందోళనకు గురి కావడంతో, జూకు చేరుకున్న వెంటనే అవి ఒకదానికొకటి గట్టిగా హత్తుకుని, భయంతో విలవిలలాడుతూ రోదించాయి. రక్షించబడిన ఐదు పిల్లలలో నాలుగింటి వయస్సు ఒక సంవత్సరం వయసు లోపే ఉండటం గమనార్హం. అటవీశాఖ అధికారులు, నందన్‌కానన్ జూ సిబ్బంది కలిసికట్టుగా ఆ ఐదు ఒరాంగుటాన్ పిల్లలను సంరకిస్తున్నారు. వాటిలో తీవ్ర మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నారు.





