
వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లో 70 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ కొలువుదీరాడు. తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు తొలి పూజ చేశారు. తొలుత మంత్రి పొన్నం ప్రభాకర్‌, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కమిటీ సభ్యులు గవర్నర్‌ దంపతులకు స్వాగతం పలికి విగ్రహం వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం అర్చకులు గవర్నర్‌ దంపతులతో పూజలు చేయించారు. ఖైరతాబాద్‌ గణనాథుడికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వినాయకుడిని దర్శించుకుంటున్నారు.




