
సాగర్‌నగర్‌: సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా గీతం డీమ్డ్ వర్సిటీలో ఇంజినీర్స్ డేను మంగళవారం ఘనంగా నిర్వహించారు. గీతం కోర్ ఇంజినీరింగ్ విభాగం, సీఎస్ఈ డైరెక్టర్లు డాక్టర్ భరణీచంద్రకుమార్, ప్రొఫెసర్ కె.తిరుపతిరావు, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ ముకుంద్ తదితరులు విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేటి తరం యువ ఇంజినీర్లు జాతి నిర్మాణంలో పాలుపంచుకోవాలన్నారు. సమకాలీన సాంకేతిక పరిజ్ఞానంతో అవకాశాలను పెంచుకోవాలన్నారు. దేశానికి ఇంజినీరింగ్ నిపుణులు వెన్నెముక లాంటివారని, యువత అంకితభావంతో ఈ రంగంలో నిపుణత సాధించాలన్నారు. స్వలాభపేక్ష లేకుండా దేశప్రగతిని కోరి పలు ఆనకట్టలను నిర్మించిన విశ్వేశ్వరయ్య జీవితాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విదార్థులకు వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





